YSRCP Incharges : వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు - రెండో జాబితా ఇదేనా ?
ఏపీలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లను మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్ త్వరలో మరిన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులకు సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా త్వరలో రెండో జాబితా విడుదలవుతుందని భావిస్తున్నారు. ఈ జాబితాలో రాష్ట్రంలో పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ జాబితాలో ఉండొచ్చని భావిస్తున్న పేర్లు వైరల్ అవుతున్నాయి.
వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులో భాగంగా త్వరలో విడుదలవుతుందని భావిస్తున్న రెండో జాబితాలో పలువురి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి నుంచి యలమంచిలికి పంపుతారని సమాచారం. కొవ్వూరు ఎమ్మెల్యే, హోంమంత్రి తానేటి వనితను గోపాలపురానికి బదిలీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మంత్రి, అమలాపురం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్ కు ఈసారి అవకాశం లేదంటున్నారు. ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింతా అనూరాధకు అవకాశం దక్కబోతోంది.

అలాగే మంత్రులు జోగి రమేశ్ (పెడన), అంబటి రాంబాబు (సత్తెనపల్లి)ను వేరే సీట్లకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరి జయరాం స్థానాన్ని మార్చటం లేదా లోక్‌సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే పి.దొరబాబు స్ధానంలో కాకినాడ ఎంపీ వంగా గీతను ఇన్ ఛార్జ్ గా ప్రకటిస్తున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని లోక్‌సభకు పంపబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సీట్ల మార్పు జాబితాలో శెట్టి ఫాల్గుణ (అరకు-ఎస్టీ), కన్నబాబురాజు (యలమంచిలి), గొల్లబాబూరావు (పాయకరావుపేట) పి.ఉమాశంకర్ గణేశ్ (నర్సీపట్నం), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ (పత్తిపాడు), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట), తలారి వెంకటరావు (గోపాలపురం-ఎస్సీ), రక్షణనిధి (తిరువూరు-ఎస్సీ), సింహాద్రి రమేశ్‌బాబు (అవనిగడ్డ), మల్లాది విష్ణు (విజయవాడ సెంట్రల్) ఉన్నారు.
వీరితో పాటు కిలారి వెంకట రోశయ్య (పొన్నూరు), వి.వరప్రసాదరావు (గూడూరు), ఆర్థర్ (నందికొట్కూరు), సుధాకర్ (కోడుమూరు), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), వై.వెంకట్రామిరెడ్డి (గుంతకల్), తిప్పేస్వామి (మడకశిర), శ్రీధర్‌రెడ్డి (పుట్టపర్తి), కోనేటి ఆదిమూలం (సత్యవేడు), శ్రీనివాసులు (చిత్తూరు), వెంకటగౌడ (పలమనేరు)ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం వైసీపీ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications