Ambati Rambabu: అంబటికి జైల్లో నిద్ర కరవు? అది పెట్టుకుంటే కానీ..!
ఏపీలో సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉంటున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు(ambati rambabu)కు అక్కడా చుక్కలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం అంబటిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు .. ఆయన్ను రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే అక్కడ ఆయనకు సాధారణంగా నిద్ర పట్టే పరిస్ధితి లేదని తెలుస్తోంది. దీంతో నిద్ర పోయేందుకు ఆయన ఓ ప్రత్యేక వైద్య పరికరాన్ని వాడుతున్నారట.
వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు నిద్రలో సాధారణంగా ఒక్కోసారి శ్వాస ఆగిపోతుంటుంది. అయితే తిరిగి దానికనే మొదలవుతుంది. మధ్యలో గ్యాప్ పెరిగితే ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే డాక్టర్లు ఆయనకు ఎలాంటి సమస్యలు లేకుండా నిద్రలో కూడా పూర్తి స్ధాయిలో శ్వాస ఆడేలా స్లీప్ అప్నియా అనే పరికరం వాడాలని సూచించారు. దీంతో ఆయన కొంతకాలంగా ఇంట్లో కూడా ఈ పరికరం వాడుతున్నారు.

అయితే తాజాగా చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో అరెస్టు అయి రాజమండ్రి జైలుకు రిమాండ్ పై వెళ్తున్న సమయంలో కోర్టుకు అంబటి రాంబాబు తన సమస్య చెప్పుకున్నారు. నిద్రలో తనకు శ్వాస ఎప్పుడైనా ఆగిపోయే పరిస్ధితి ఉన్నందున జైల్లో స్లీప్ అప్నియా పరికరం వాడేందుకు అనుమతి కోరారు. దీంతో కోర్టు కూడా ఇందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో అంబటి రాజమండ్రి జైల్లో స్లీప్ అప్నియా పరికరం పెట్టుకుని నిద్రపోతున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. అంబటి జైల్లో ఉన్నన్ని రోజులు ఈ పరికరం తప్పకుండా వాడాల్సిన పరిస్ధితి ఉంది.












Click it and Unblock the Notifications