జూనియర్ ఎన్టీఆర్ తో పాటు బీఆర్ఎస్, వైసీపీ రాజకీయాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనాలు

జూనియర్ ఎన్టీఆర్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ మరోమారు తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశం పైన కీలక వ్యాఖ్యలు చేయడంతో మరో మారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం పైన చర్చ జరుగుతుంది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని వైయస్ జగన్ కోరుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానాన్ని చెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలు
ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగుదేశం పార్టీలోని 70 నుంచి 80 శాతం మంది జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు నిజమైన వారసుడు అతనేనని భావిస్తున్నారన్నారు.

YSRCP Leader Kethireddy venkataramireddy Key Comments on Jr NTR Political Entry Go Viral

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలపై జగన్ అభిప్రాయమిదే
ఇప్పుడు ఉన్న రాజకీయ వ్యవస్థలో జూనియర్ ఎన్టీఆర్ అయితే కొత్త ముఖమని, ఆయన రాజకీయాలలోకి వస్తే, రాజకీయాలు ఇంత దిగజారి ఉండవని జగన్ కూడా భావిస్తూ ఉండొచ్చని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇక ఇదే సమయంలో వైసిపిలోని 80 నుంచి 90 శాతం మంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ విజయం సాధించాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కేతిరెడ్డి వ్యాఖ్యలు
బీఆర్ఎస్ లోని 80 నుంచి 90 శాతం మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి గెలవాలని ఆకాంక్షిస్తారు అని తెలిపారు. కెసిఆర్, కేటీఆర్ లకు వైయస్ జగన్ తో ఉన్న సంబంధాలతో పాటు రేవంత్ రెడ్డి, చంద్రబాబులను ఓడించాలనే లక్ష్యం దీనికి ప్రధాన కారణమని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం పైన తెలుగు రాష్ట్రాలలో చాలాకాలంగా చర్చ జరుగుతుంది.

రాజకీయాల్లోకి రావాలని పెద్దఎత్తున డిమాండ్
ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా 2009 ఎన్నికల సమయంలో విస్తృతంగా పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత వివిధ పరిణామాల కారణంగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య దూరం పెరిగి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత వివిధ సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని పెద్దఎత్తున డిమాండ్ వచ్చినప్పటికీ ఆయన మాత్రం దీనిపైన స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+