కామన్‌సెన్స్‌లేకుండా బాబు మాటలు: వంగవీటి రాధా
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ నేత వంగవీటి రాధా విరుచుకుపడ్డారు. మాజీ ఎమ్మెల్యేలైనా తాను, తన తల్లిపై అవమానంగా వ్యవహరించిన విజయవాడ పోలీసులకు చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు.
బుదవారంనాడు విజయవాడలో వంగవీటి రాధా మీడియాతో మాట్లాడారు. వాస్తవాలను తెలుసుకోకుండా చంద్రబాబు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని అన్నారు. వైసీపీలో ఎవరు తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పారు.

వంగవీటి రంగా గురించి తమ నేత ఒకరు తప్పుగా మాట్లాడితే, తమ అధినేత జగన్ వెంటనే చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏమి చేసినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు అధికారులపై దాడులకు కూడా దిగారని... అయినా చంద్రబాబు వారిని ఏమీ అనలేదని విమర్శించారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సాక్షాత్తు చంద్రబాబునే విమర్శించినా పట్టించుకోని దుస్థితి టీడీపీలో నెలకొందని వంగవీటి రాధా ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కామన్ సెన్స్ కూడా లేదన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారని రాధా మండిపడ్డారు. ప్రెస్ మీట్ కు వెళుతుండగా తనను పోలీసులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత తనను, తన తల్లిని రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని, చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications