గన్నవరం వదిలి వెళ్లిపోయిన వల్లభనేని వంశీ
ఏపీ శాసనసభ ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పార్టీ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమవుతున్నవేళ ఈ నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసిన వల్లభనేని వంశీ ఘోరంగా ఓటమిపాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓటమి చవిచూడటంతో తన సొంత నియోజకవర్గం గన్నవరంను వదిలిపెట్టారు. కుటుంబంతో కలిసి హైదరాబాద్ బయలుదేరినట్లు తెలుస్తోంది.
పోలీసుల కవాతు
మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటిపై కొందరు రాళ్లు, గాజు సీసాలు విసరడంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో ఈ తరహా సంఘటనలు రెండు చోటుచేసుకున్నాయి. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయేమోననే అనుమానంతో పోలీసులను భారీగా మొహరించారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు కవాతు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

తొమ్మిదికే పరిమితం
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. తెలుగుదేశం పార్టీ 136 స్థానాలు, జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోను, బీజేపీ పోటీచేసిన 10 స్థానాలకు ఎనిమిది స్థానాల్లో గెలుపొందాయి. లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 16, జనసేన 2, బీజేపీ 3, వైసీపీ నాలుగు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
అందరిలో సందేహమే
కేంద్రంలో నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందా? లేదా? అనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ తోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలో సీట్లు తగ్గడం ఆ కూటమిని భారీగా దెబ్బతీసింది. ఎన్డీయే కూటమికి చేరువలోనే ఇండియా కూటమి కూడా ఉంది. రేపు ఎన్డీయే కూటమి సమావేశం జరగబోతోంది. ఆలోపుగా మెజారిటీకి అవసరమైన స్థానాలు వస్తాయా? లేదా? అనేది తేలుతుంది.
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications