Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేసిన మరో వైసీపీ ఎమ్మెల్యే, అందుకే దూరంగా ఉంటున్నా ..!

వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి.గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండగా, మరి కొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కిలారు రోశయ్య, మద్దాలి గిరి, సిద్దా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని , బాలినేని, సామినేని ఉదయభాను గ్రంధి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు.

మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు,ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు.ఇక పార్టీకి వెన్నుముఖగా నిలిచిన ఎంపీ విజయసాయిరెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజ్యసభ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారు.క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇక విజయసాయిరెడ్డి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సైతం పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

YSRCP MLA gives clarity on party change

గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన టీడీపీలో వెళ్తున్నారనే గుస గుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మారుతున్నారని వస్తోన్న వార్తలపై ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తాజాగా స్పందించారు. ఈ విషయంపై ఆయన కీలక ప్రకటన చేశారు.తాను పార్టీ మారబోతున్నట్టు వస్తోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు.

తాను వ్యక్తిగత సమస్యల కారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు.తాను ఎప్పటికీ పార్టీ మారే ప్రసక్తే లేదని తనకు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉందని.. అదే గౌరవంతో ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.తన రాజకీయ ప్రయాణం జగన్ వెంటేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+