చిరంజీవి పక్కా కమర్షియల్-పవన్ కు విలువల్లేవ్-వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ముఖ్యంగా చిరంజీవి కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. తాజాగా చిరంజీవి.. ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించడం, ఆ తర్వాత బీజేపీ-జనసేన నేతలు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ తో భేటీ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఆయనపై విమర్శలకు దిగింది. దీనిపై స్పందించిన ఆయన సోదరుడు పవన్ చేసిన విమర్శలు వైసీపీని ఘాటుగా తాకాయి.

నిన్న నరసాపురం సభలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ తీవ్ర విమర్శలు చేశారు. మఖ్యంగా తన సోదరుడు చిరంజీవిపై సజ్జల చేసిన కామెంట్స్ పై స్పందించిన పవన్.. ఆయనపై వ్యాఖ్యలు చేస్తే సహించబోనన్నారు. దీనిపై ఇవాళ వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పందించారు. పవన్ తో పాటు చిరంజీవిపైనా గ్రంథి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో చిరంజీవి, పవన్ పై వైసీపీ దాడి మరింత ముదిరినట్లయింది.

ysrcp mla grandhi srinivas says chiranjeevi commercial pawan kalyan has no values

పవన్ కల్యాణ్ భాష చూస్తే ఆయనకు పిచ్చి ముదిరినట్లు అనిపిస్తోందని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలంటూ గ్రంథి శ్రీనివాస్ సూచించారు. భీమవరం గురించి పవన్ క‌ల్యాణ్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. పవన్ మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకుని, మంచి వైద్యం చేయించాలని చిరంజీవికి గ్రంథి సూచించారు. భీమవరంలో సీఎం జగన్ పై పవన్ వాడిన
భాష అభ్యంతకరంగా ఉందన్నారు. పవన్ మాటలకు సానుభూతితో పాటు భయం కలుగుతోందన్నారు.

అలాగే పవన్ కల్యాణ్ విలువల్లేని వ్యక్తి అని, పార్టీ పెట్టి ఎలా డబ్బు సంపాదించాలో తెలిసిన మంచి వ్యాపారవేత్త అని గ్రంథి ఆరోపించారు. జనసేనను టీడీపీలో విలీనం చేస్తే మంచి ప్యాకేజీ తీసుకోవచ్చన్నారు. వంగవీటి రంగాను చంపించిన చంద్రబాబుతో పవన్ అంటకాగుతున్నారంటూ విమర్శించారు. పవన్ కల్యాణ్ మానసిక స్థితి బాగాలేదని, మానసిక ఆరోగ్యం కుదుటపడటానికి తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలని సూచించారు.

అలాగే చిరంజీవిపైనా గ్రంథి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ క‌ల్యాణ్‌ను కాకా పట్టడానికే జనసేన పార్టీకి చిరంజీవి 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారన్నారు.తన సినిమాలకు ఓపెనింగ్ రావన్న భయంతోనే తమ్ముడిని కాకాపడుతున్నారని, పైసా కోసం చిరు ఏదైనా చేస్తారన్నారు.గతంలో కేంద్ర మంత్రి పదవి తీసుకుని ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి హోల్ సేల్‌గా కాంగ్రెస్‌కు అమ్మేశారని, అలాగే పవన్ కూడా జనసేనను టీడీపీలో కలిపేస్తే బావుండేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+