జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్-ఎక్కడున్నా వచ్చి కొడతా-వైఎస్ వదులుంటే..
లండన్ లో బాత్రూమ్ లు కడిగేవారంటూ వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఆయన ఘాటు కౌంటర్ ఇచ్చారు. జేసీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేతిరెడ్డి.. ఆయన మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వచ్చి కొడతానని హెచ్చరించారు. అాలాగే జేసీ బ్రదర్స్ రాజకీయాలపైనా కేతిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంతకీ కేతిరెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం..
తాను లండన్ లో పని చేశానంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. తాను విదేశాలకు పోయింది చదువుకునేందుకు అన్నారు. తాను లండన్ లో పని చేసింది.. నువ్వు నీకుమారుడు బాత్ రూంలో ఉండి చూశారా అని సూటిగా ప్రశ్నించారు. నీ కొడుకు విదేశాల్లో ఉండి రాణులకు, మహిళలకు మసాజ్ లు చేశాడా అని అడిగారు. విదేశాలకు వెళ్లి పనులు చేసిన వారిని అవమానించేలా మాట్లాడుతావా అని జేసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీలాగా అందరూ దొంగ లారీలు చేసుకుని దొంగగా బతకలేదని జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి విమర్శలు గుప్పించారు. తాడిపత్రిలో నువ్వు వసూళ్లు చేయనిది ఎక్కడంటూ ప్రశ్నించారు. ధర్మవరంకి వస్తానన్నావ్ రా చూస్తాం.. వెనక్కు పోతావేమో చూద్దాం అని సవాల్ విసిరారు. ఇంకోసారి ఇలా మాట్లాడితే.. ఎక్కడున్న నేనే వచ్చి కొడతానంటూ కేతిరెడ్డి జేసీని హెచ్చరించారు. కేతిరెడ్డి పేరు చెబితే కానీ నువ్వు, మీ కుటుంబం బతకలేదన్నారు.

మీరు మీ కుటుంబం నా కాలి గోటికి సరిపోరంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు.టీడీపీ వాళ్లను చంపి.. ఆ పార్టీలో ఎలా ఉంటావ్ అని జేసీ బ్రదర్ ను ఆయన ప్రశ్నించారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నన్ను తాడిపత్రికి పంపింటే నీ చాప్టర్ ముగించే వాడిని అంటూ కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications