మంత్రి పెద్దిరెడ్డి vs వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే
YS Jagan: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటోన్న మార్పులు చేర్పులు కొత్త సమీకరణాలకు దారి తీస్తోన్నాయి. టికెట్ దక్కని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆశావహులు రాజీనామాల బాట పడుతున్నారు. వైసీపీ అగ్రనాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు.
ఇప్పటికే కర్నూలు, నరసరావుపేట, మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీలు డాక్టర్ సంజయ్ కుమార్, లావు కృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి.. పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీలు సీ రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్, దాడి వీరభద్రరావు గుడ్ బై చెప్పారు. మార్పులు చేర్పులకు అంగీకరించకపోవడం, మళ్లీ పోటీ చేేసే అవకాశం దక్కకపోవడం వంటి కారణాలతో వారంతా రాజీనామాల బాట పట్టారు.

తాజాగా అదే జాబితాలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే చేరడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కోనేటి ఆదిమూలం.. బాహటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆయనను తిరుపతి లోక్‌సభ ఇన్‌ఛార్జీగా అపాయింట్ చేశారు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తిని సత్యవేడు అభ్యర్థిగా ఖరారు చేశారు.
తిరుపతి ఎంపీగా పోటీ చేయడానికి ఆదిమూలం అంగీకరించట్లేదు. మరోసారి సత్యవేడు టికెట్‌ను తనకే కేటాయించాలని పట్టుబట్టుతున్నారు. ఆయనకు నచ్చజెప్పినప్పటికీ.. ఒప్పుకోవట్లేదు. తన స్థానాన్ని మార్చడానికి జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే కారణమని ఆరోపించారు.
సత్వవేడు నుంచి టికెట్ అడిగానని, తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించిందని ఆదిమూలం చెప్పారు. తన సొంత మండలం నారాయణవనం సత్యవేడు పరిధిలోనే ఉందని, తన బంధుగణం అంతా అక్కడే ఉందని, ఈ సారి కూడా తప్పకుండా గెలుస్తానని జగన్‌కు వివరించానని అన్నారు.
వైసీపీకి మరో షాక్... పార్టీ వీడే యోచనలో కోనేటి ఆదిమూలం..!#KonetiAdimulam #CMYSJagan #YSJagan #YSRCParty #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/SxdnTNtNZf
— oneindiatelugu (@oneindiatelugu) January 28, 2024
తనపై ప్రతికూల రిపోర్ట్ రావడం వల్లే సత్యవేడు నుంచి తప్పించానని జగన్ చెప్పారని పేర్కొన్నారు. తనపై నెగెటివ్‌గా రిపోర్ట్ ఇచ్చిన ఆ నలుగురు ఎవరో తనకు బాగా తెలుసునని, వారే దొంగలని, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని జగన్ ముందే తేల్చి చెప్పానని కోనేటి ఆదిమూలం అన్నారు.












Click it and Unblock the Notifications