ఎమ్మెల్యే రోజాకు చుక్కెదురు: అసెంబ్లీకి అనుమతిస్తారా?

హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులోని డివిజన్ బెంచ్ ఎదుట చుక్కెదురైంది. గత అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రోజాను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏడాది పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది.

దాంతో రోజా సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించారు. అయితే పిటిషన్‌ను స్వీకరించిన సింగిల్ బెంచ్ ఈ నెల 8వ తేదీన వాదనలు వింటామని చెప్పింది. దీనిపై మరోసారి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని రోజా నిర్ణయించారు. ఈ నెల 5 నుంచి ప్రారంభంకానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హైకోర్టు ద్వారా వెళ్లేందుకు రోజా తనవంతు ప్రయత్నాలు చేస్తూన్నారు.

ysrcp mla roja went division bench for assembly suspension

5వ తారీఖు లోపు హైకోర్టు తీర్పు వెల్లడిస్తే, రోజాను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతిస్తారు. ఒకవేళ సింగిల్ బెంచ్ రోజా వాదనలను 8వ తేదీన వింటే మాత్రం ఈ బడ్జెట్ సమావేశాలకు రోజా హాజరవడం అనుమానమే. తన సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఈ నెల 9కి వాయిదా వేయడాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే రోజా డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది.

రోజా తరుపున సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ మంగళవారం వాదనలు వినిపించారు. రోజా సస్పెన్షన్‌పై దాఖలైన వ్యాజ్యంలో శాసన వ్యవహారాల శాఖ, అసెంబ్లీ కార్యదర్శులు కౌంటర్లు దాఖలు చేయకుండా వాయిదా కోరారని, ఈ నెల 5 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున 9వ తేదీకి వాయిదా వేయడం వల్ల పిటిషనర్‌ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కోల్పోతారని తెలిపారు.

ysrcp mla roja went division bench for assembly suspension

కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏదో ఒక సాకుతో వాయిదా కోరుతున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం సభ నుంచి సస్పెండ్‌ చేసే అధికారం ఒక సెషన్‌కు మాత్రమే పరిమితం చేయాలన్నారు. దానిపై అదనపు ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ గత నెల 17న ఇచ్చిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శికి 24న అందాయని, వాదనలు చెప్పాలని తనను కోరారని, ఆ విషయాన్నే కోర్టుకు చెప్పి వాయిదా కోరానని తెలిపారు.

అంతేకాదు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 194(3) ప్రకారం సభా మర్యాదలు పాటించని సభ్యులను స్పీకర్‌ సస్పెండ్‌ చేయవచ్చని చెప్పారు. ఈ వాదనలు విన్న హైకోర్టు సింగిల్‌ జడ్జి ముందున్న కేసు విచారణను 9వ తేదీ కంటే ముందుగానే చేపట్టాలని కోరతామని స్పష్టం చేస్తూ విచారణను ఈనెల 3వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+