చంద్రబాబు బతకాలి కానీ.. అది చూసేందుకే- గోరంట్ల మాధవ్ మరో రచ్చ..

ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ నేతల మాటల దాడి మరింత పెరిగింది. అదే సమయంలో తన వ్యాఖ్యలతో కలకలం రేపే వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చంద్రబాబును ఉద్దేశించి తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చంద్రబాబు పోతాడు, జగన్ సీఎం అవుతాడంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యల్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దీంతో తన ఉద్దేశం అది కాదంటూ టీడీపీ రాజకీయంగా చనిపోతుందని మాత్రమేనంటూ వివరణ కూడా ఇచ్చారు.

ఇవాళ ఆ పాత వ్యాఖ్యను కాస్త అటు ఇటు మార్చి గోరంట్ల మాధవ్ ఇవాళ మరోసారి ప్రయోగించారు. ఈసారి మాధవ్..చంద్రబాబు బతకాలి, జగన్ రెండోసారి సీఎం అవడం చూడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ గెలిచి సీఎం అవుతాడని చంద్రబాబు చస్తాడు అంటూ వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈసారి మరో విధంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు బతకాలి... జగన్ రెండోసారి సీఎం కావడం చూసి ఆయన ఏడవాలి అని ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.

ysrcp mp gorantla madhav another interesting comment on chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపింది సీఎం జగన్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని గోరంట్ల మాధవ్ తప్పుబట్టారు. చంద్రబాబు కేసులో "ఎఫ్ఐఆర్ నమోదు చేసింది పోలీసులు, జగన్ కాదన్నారు.. దర్యాప్తు చేసింది పోలీసులు, జగన్ కాదన్నారు. చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపింది నువ్వో, నేనో, ఇంకెవరో కాదని, కోర్టుకు ఆ అధికారం ఉందని గోరంట్ల తెలిపారు. జడ్జిలకు ఆ అధికారం ఉందన్నారు. కోర్టు చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిందని, జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న వ్యక్తి జైల్లోనే ఉండాలన్నారు.

మరోవైపు జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ఈ ప్రభుత్వానిదే భరోసా అని గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. జైల్లో అందరు ముద్దాయిల కంటే చంద్రబాబు పెద్ద ముద్దాయి కాబట్టి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుందన్నారు. చంద్రబాబు ప్రాణాలకు ఈ ప్రభుత్వం ప్రాణాలైనా అడ్డువేసి బతికిస్తుందన్నారు. చంద్రబాబు బతకాలి... 2024లో జగన్ మళ్లీ సీఎం కావడాన్ని ఆయన చూడాలనేది మా ఆకాంక్ష. చంద్రబాబు చనిపోవడానికి వీల్లేదు" అంటూ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+