జగన్‌కు రఘురామ లెటర్స్ సిరీస్- నెరవేరని హామీలపై- ఈ సారి లేఖలో టార్గెట్ అవే
వైసీపీ అధినేత కమ్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్ల పెంపు, సీపీఎస్ రద్దు వంటి నెరవేరని హామీలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా లేఖలు రాస్తున్న రఘురామ ఇవాళ మరో హామీని ఎంచుకుని జగన్‌కు లేఖ రాశారు. దాదాపు ఎన్నికల హామీలన్నీ నెరవేర్చినట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్న నేపథ్యంలో రఘురామ లేఖలకు ప్రాధాన్యం ఏర్పడింది.
Recommended Video
వైసీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాల కింద ఇచ్చే మొత్తాల పెంపు కూడా ఒకటి. ఈ పథకాల కింద ఇచ్చే మొత్తాల్ని లక్ష రూపాయలకు పెంచుతామని వైసీపీ హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఈ హామీ నెరవేరలేదని రఘురామకృష్ణంరాజు తన తాజా లేఖలో సీఎం జగన్‌ను ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఈ రెండు పథకాలకు ఇచ్చే మొత్తం పెంచుతామని జగన్ ఇచ్చిన హామీని లేఖలో రఘురామ ప్రస్తావించారు.

ప్రభుత్వం ఎన్నికల హామీల్ని దాదాపుగా నెరవేర్చినట్లు వైసీపీ నేతలు చెప్పుకుంటున్న నేపథ్యంలో ఏయే హామీలు నెరవేరలేదో ప్రతి రోజూ సీఎం జగన్‌కు లేఖల రూపంలో రఘురామరాజు బయటపెడ్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా దీనిపై ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ రఘురామను టార్గెట్ చేస్తూ మాట్లాడిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆయన తాజా లేఖలపై మాత్రం మౌనం వహిస్తున్నారు. అటు రఘురామ కూడా ఏదో ఒక అంశంతో నిత్యం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ లైవ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications