VijayaSai Reddy: విజయసాయిరెడ్డి ఇక "సంసద్ మహారత్న" ..!
వైసీపీ రాజ్యసభ ఎంపీ, పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్న విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం లభించింది. రాజ్యసభ చర్చల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి పనితీరుకు బెస్ట్ పార్లమెంటేరియన్ గా సంసద్ రత్న అవార్డు లభించింది. విజయసాయిరెడ్డిని సంసద్ మహారత్న అవార్డుకు ఎంపిక చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏటా బెస్ట్ పార్లమెంటేరియన్లకు ఇచ్చే ఈ పురస్కారాన్ని సాయిరెడ్డి ఇవాళ అందుకున్నారు.
ఢిల్లీలోని మహారాష్ట్ర సధన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంసద్ మహారత్న అవార్డు అందుకున్నాకరు. రవాణ,పర్యాటక సంస్కృతిక పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో ప్రతిష్టాత్మకమైన సంసద్ మహా రత్న అవార్డును ఈయన అందుకున్నారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్ కూడా ఈ అవార్డుల కార్యక్రంలో పాల్గొన్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్ రాజ్ అహిర్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఈ అవార్డులను అందజేశారు. 17వ లోక్ సభ కాలంలో టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అత్యుత్తమ పనితీరుకు గాను ఈ అవార్డు విజయసాయిరెడ్డి దక్కింది
Grateful and honored to receive the prestigious Sansad Maha Ratna award at the 14th Edition of Sansad Ratna Awards 2024. Recognized for my contributions through the Parliamentary Standing Committee on Transport, Tourism, and Culture. This award is a testament to the dedication… pic.twitter.com/hqWjfFk4hD
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 17, 2024
సంసద్ రత్న అవార్డ్స్ 2024 14వ ఎడిషన్‌లో ప్రతిష్టాత్మకమైన సంసద్ మహా రత్న అవార్డును అందుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవంగా భావిస్తున్నట్లు సాయిరెడ్డి ట్వీట్ చేశారు. రవాణా, పర్యాటకం, సంస్కృతిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ద్వారా తన సహకారానికి గుర్తింపు లభించిందన్నారు. ఈ అవార్డు 17వ లోక్‌సభ కాలంలో తన అంకితభావానికి, ప్రభావానికి నిదర్శనమన్నారు. సంసద్ రత్న, సంసద్ మహారత్న, సంసద్ ఉత్కృష్ట మహారత్న అవార్డులు అందుకున్న వారిలో ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, భతృహరి మహాతా, సుప్రియా సులే, శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, హీనా గవిట్, జయంత్ సిన్హా, గద్ది గౌడ, సుధీర్ గుప్తా, అమోల్ రాంసింగ్ కొల్హే, రాజ్ శర్మ ఉన్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications