హవాలా మనీ: ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ5 ఛైర్మన్‌పై ప్రధానికి వైసీపీ ఎంపీల ఫిర్యాదు

న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. వారిద్దరి మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో 15 మంది ఎంపీల బృందం ఫిర్యాదులో పేర్కొంది.

మిలియన్ యూరోల బదిలీ జరిగినట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆరోపించారు. మనీలాండరింగ్, ఫెమా చట్టాల కింద విచారణ జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా వైసీపీ ఎంపీలు కలిశారు. రఘురామ దేశం విడిచి పారిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 YSRCP MPs complaints to PM Modi against mp raghurama krishnaraju and tv5 chairman.

రఘురామ, నాయుడులను కస్టడీలోకి తీసుకోవాలని, అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీయాలని వైసీపీ ఎంపీలు కోరారు. పోలవరం, ప్రత్యేక హోదాపైనా వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమెను కోరారు. పోలవరం తుది డీపీఆర్‌కు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. 2017-18 ధరల ప్రకారం భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కలిపి రూ. 55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ, టీఏసీలు ఆమోదం తెలిపాయని వివరించారు.

వైసీపీ ఎంపీ విజయసాయికి రఘురామ కౌంటర్

ఇది ఇలావుండగా, తనపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడారు. తాను విదేశాలకు వెళ్లకుండా చూడాలంటున్నారని.. 20 కేసులున్న విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్లొచ్చా? అని ప్రశ్నించారు.

ఏ-1 చేపట్టిన పనులపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామ తెలిపారు. ఏ-2 స్థాపించిన సూట్ కేసు కంపెనీలతో ఏ-1 కార్యకలాపాలు జరిగాయన్నారు. క్విడ్ ప్రోకో, సూట్ కేసు కంపెనీల బాగోతాన్ని లేఖలో వివరించినట్లు చెప్పారు. జగన్, విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+