సన్నాసి సర్వే: లగడపాటిపై గట్టు, పొన్నాల నో కామెంట్
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే ఫలితాలపై వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గట్టు రామచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. లగడపాటి సర్వే సన్నాసి సర్వే అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విరుచుకపడ్డారు.
లగడపాటి సర్వే బెట్టింగుల కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు. లగడపాటి రాజగోపాల్ రాజకీయాలు మానేసి బెట్టింగ్ వ్యాపారం ప్రారంభించారని ఆయన ఆరోపించారు. తమ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని లగడపాటికి తెలుసునని ఆయన అన్నారు. అయితే, బెట్టింగ్‌ల ద్వారా సంపాదనే లక్ష్యంగా లగడపాటి సర్వే ఉందని ఆయన అన్నారు

ఈ నెల 16వ తేదీన తమ పార్టీ గెలిచిన తర్వాత లగడపాటి కమండలం పట్టుకుని హిమాలయాలకు వెళ్తారా అని ఆయన సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు ఇటువంటి సర్వేలన్నీ తిరగబడడం ఖాయమని ఆయన అన్నారు.
లగడపాటి సర్వేపై తాను వ్యాఖ్యానించబోనని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 3 వేల చట్టాలు చేశామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణలో చట్టాలను పటిష్టం చేస్తామని ఆయన చెప్పారు.
ఎంపిటిసి, జడ్పిటీసి ఎన్నికల్లో ఓట్ల శాతంలో తమదే ముందంజ అని ఆయన అన్నారు. తెలంగాణలో ఐదు జడ్పీటీసిలు సొంతం చేసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెసు ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మజ్లీస్ తమకు మిత్రపక్షమని, మిత్రపక్షంగానే ఉంటుందని ఆయన చెప్పారు. తమ మిత్రులతో తమకు అవగాహన ఉందని చెప్పారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications