Raghurama : నాని దసరా సినిమాపై రఘురామ ప్రశంసలు-జగన్ సర్కార్ కు లింక్ చేస్తూ సెటైర్లు..

ఏపీలో నిత్యం వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై విమర్శలు చేసే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..ఇవాళ మరోసారి అదే పని చేశారు. అయితే కాస్త భిన్నంగా ఓ సినిమాను లింక్ చేస్తూ విమర్శలు చేశారు. టాలీవుడ్ హీరో నాని నటించిన దసరా చిత్రంలో సన్నివేశాల్ని వైసీపీ సర్కార్ కు లింక్ చేస్తూ రఘురామ ఈ విమర్శలు చేశారు.

హీరో నాని దసరా సినిమాను ప్రస్తావిస్తూ రఘురామ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కూడా దసరా సినిమా చూశానని, ఇందులో మద్య నిషేధం పాయింట్ ఉందని తెలిపారు. ఓ గ్రామంలో ఎన్నికల సందర్భంగా మద్యం తీసేస్తానన్న వ్యక్తి ఓడిపోతాడని, మద్యం ఇస్తానని, డబ్బులు కూడా ఇస్తానని చెప్పిన వ్యక్తి గెలుస్తాడని పేర్కొన్నారు. ఆ గ్రామంలో 'సిల్క్' పేరిట ఓ బార్ ఉంటుందని, అందులో ప్రభుత్వం అందించే చీప్ లిక్కర్ సరఫరా చేస్తుంటారని రఘురామ తెలిపారు. అయితే ఈ గ్రామంలో క్రమంగా మగవారి సంఖ్య తగ్గిపోతుంటుందని, ఇందుకు కారణం ఏంటంటే... మగవాళ్లు ఆ సిల్క్ బార్ లో చీప్ లిక్కర్ తాగడమేనన్నారు.

ysrcp rebel mp raghurama raju lauds hero nanis dasara movie-links with jagan regime liquor policy

కొన్నాళ్లకు అక్కడ ప్రజల్లో చైతన్యం వస్తుందని రఘురామ తెలిపారు. ఇలాంటి చెత్త సరుకు వల్ల ప్రజల ప్రాణాల మీదకు వస్తోందని గుర్తిస్తారన్నారు. ఇలా మగవారి సంఖ్య తగ్గించి, ఆడవారి సంఖ్య పెరిగిపోయేలా చేస్తున్న ఇలాంటి దరిద్రులను ఎన్నుకుని మనం తప్పు చేశామని వాళ్లు భావిస్తారని తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో వాళ్లను గ్రామ ప్రజలు ఓడిస్తారని చెప్పారు. లిక్కర్ తీసుకువచ్చి ప్రజల ప్రాణాలను హరిస్తున్నవాళ్లను ప్రజలు ఎన్నికల్లో తిప్పికొడతారన్నారు. మన రాష్ట్రంలోనూ నాన్న బుడ్డి రూపంలో అమ్మ ఒడి డబ్బులు లాగేస్తున్నాం కదా... ఇదేం న్యాయం అని అడగండి మమ్మల్ని అన్నారు. ఈ లిక్కర్ తాగి కిడ్నీలు, లివర్ చెడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, అందులో కెమికల్స్ ఉన్నాయని కంప్లెయింట్ ఇచ్చినా, మేనేజ్ చేసేశారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+