పవన్ జ్వరం అప్పటిదాకా తగ్గదు..! శ్యామల సెటైర్లు..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంతకాలంగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఓజీ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వరకూ బాగానే ఉన్న పవన్ .. ఆ తర్వాత ఒక్కసారిగా జ్వరం బారిన పడ్డారు. అయితే తొలుత అలాగే అసెంబ్లీ సమావేశాలకు, అధికారిక సమీక్షలకూ హాజరైన పవన్.. ఆ తర్వాత దగ్గు కూడా తోడవడంతో డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్లిపోయినట్లు జనసేన వర్గాలు అధికారికంగానే ప్రకటించాయి.

అయితే పవన్ ఆరోగ్యంపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల తాజాగా స్పందించారు. పవన్ కు వచ్చిన వైరల్ జ్వరం మామూలు జ్వరం కాదంటూ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆమె.. పవన్ ను ఉద్దేశించి పలు సెటైర్లు వేశారు. పవన్ కు వచ్చిన జ్వరం అప్పటివరకూ తగ్గదంటూ రాష్ట్రంలో పెండిగ్ లో ఉన్న కొన్ని సమస్యల్ని ప్రస్తావించారు. ఇవి జరిగేవరకూ పవన్ కు జ్వరం తగ్గదని శ్యామల తేల్చేశారు. చివరిగా పవన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

YSRCP s Shaik Syamala Mocks Pawan Kalyan s Fever Links to Vizag Steel and Medical College

శ్యామల ట్వీట్ లో అయ్యబాబోయ్ .. అది మామూలు జ్వరం కాదట ..! అంటూ మొదలుపెట్టారు. విశాఖ ఉక్కును , మెడికల్ కాలేజీ లను పూర్తిగా అమ్మేసే వరకు , రైతులు , ఆటో కార్మికులు , విద్యార్థులు , నిరుద్యోగులు , పిఠాపురంలో మత్స్యకారులు , చిరు అభిమానులు శాంతించే వరకు ... ఆయనకి జ్వరం తగ్గదట ! అని శ్యామల పంచ్ లు వేశారు. చివరిగా గెట్ వెల్ సూన్ పీపీపీ గారూ, పవన్ కళ్యాణ్ గారూ అంటూ ముగించారు. ఈ ట్వీట్ పై జనసైనికులు కౌంటర్లు వేయడం మొదలుపెట్టేశారు. గత ఐదేళ్లూ మీ కంటే ఎక్కువ ఎగిరారని, ఒక్కసారి తిరగేస్తే తిరిగి కోలుకోని స్థితికి పోయారని రివర్స్ పంచ్ లు వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+