బెజవాడలో కృష్ణానది రిటైనింగ్ వాల్ కట్టిందెవరు ? వైసీపీ-టీడీపీ ట్వీట్ వార్..!
విజయవాడలో గత వైసీపీ, టీడీపీ ప్రభుత్వాల హయాంలో నిర్మితమైన కృష్ణానది రిటైనింగ్ వాల్ ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ కు భారీ వరద ప్రవాహం వస్తున్నా సమీప ప్రాంతాల ప్రజలు ఏమాత్రం భయం లేకుండా నిశ్చింతగా ఉంటున్నారు. దీంతో ఇప్పుడు ఆ రిటైనింగ్ వాల్ కట్టిందెవరన్న చర్చకు వైసీపీ తెరలేపింది. దీంతో అధికార టీడీపీ ఓ వీడియోను పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది. దీనికి కొనసాగింపుగా నెటిజన్లు కూడా పార్టీల వారీగా విడిపోయి కౌంటర్లు వేసుకుంటున్నారు.
ముందుగా ఈ ట్వీట్ వార్ మొదలుపెట్టింది వైసీపీయే. వైయస్ జగన్ గారి హయాంలో రూ.369.89కోట్లతో నిర్మించిన రిటైనింగ్ వాల్ తో.. కృష్ణా నది పరుగులు పెడుతున్నా గుండెలపై చేయి వేసుకుని నిశ్చింతగా ఉన్న బెజవాడ వాసులు అంటూ వైసీపీ ఇవాళ ఎక్స్ లో ఓ ట్వీట్ పెట్టింది. ఇందులో రిటైనింగ్ వాల్, కృష్ణానది ప్రవాహంతో పాటు వైఎస్ జగన్ ఫొటో కూడా పెట్టింది. దీనిపై టీడీపీ స్పందించి కౌంటర్ ఇచ్చింది.

"ఫేకు జగన్" ఇలా కూడా ఫేకులు చేస్తారా ? అంటూ ఎక్స్ లో టీడీపీ పోస్టు పెట్టింది. నీ మొఖానికి అభివృద్ధి చేయటం వచ్చా ? ఎవరో చేసిన పని, నువ్వు చేసినట్టు, ఎలా సిగ్గు లేకుండా చెప్తావ్ ? అంటూ రెచ్చిపోయింది. విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన, కృష్ణలంక రిటైనింగ్ వాల్ కోసం 2014 ముందు పోరాడి, అధికారంలోకి వచ్చాక, రూ.164 కోట్లతో, 2.1 కి.మీ.ల రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేసింది టీడీపీ. చంద్రబాబు గారు చేసిన పనిని, మీ పనిగా చూపించుకుంటున్నారు. ఆ దేవుడు మీకు సిగ్గు ఎట్లా పెట్టలేదు "ఫేకు జగన్"? అంటూ విమర్శలు గుప్పించింది. Mar 23, 2019 వీడియో ఇది అని తెలిపింది. దీంతో ఇరు పార్టీల సానుభూతిపరులు ఘాటుగా స్పందిస్తున్నారు.
వైయస్ జగన్ గారి హయాంలో రూ.369.89కోట్లతో నిర్మించిన రిటైనింగ్ వాల్ తో.. కృష్ణా నది పరుగులు పెడుతున్నా గుండెలపై చేయి వేసుకుని నిశ్చింతగా ఉన్న బెజవాడ వాసులు. pic.twitter.com/bctoZvAkfj
— YSR Congress Party (@YSRCParty) August 8, 2024
"ఫేకు జగన్" ఇలా కూడా ఫేకులు చేస్తారా ?
— Telugu Desam Party (@JaiTDP) August 8, 2024
నీ మొఖానికి అభివృద్ధి చేయటం వచ్చా ? ఎవరో చేసిన పని, నువ్వు చేసినట్టు, ఎలా సిగ్గు లేకుండా చెప్తావ్ ?
విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన, కృష్ణలంక రిటైనింగ్ వాల్ కోసం 2014 ముందు పోరాడి, అధికారంలోకి వచ్చాక, రూ.164… https://t.co/ldIzex4Ddy pic.twitter.com/51pVA4T8q1
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications