వకీల్‌సాబ్‌ టార్గెట్‌కు తిరుపతిలో ప్రతీకారం- జగన్ సర్కార్‌పై బీజేపీ నేత విష్ణు షాకింగ్‌

ఏపీలో తిరుపతి ఉపఎన్నిక ప్రభావం రాజకీయంగా విమర్శలకు దారితీస్తోంది. తిరుపతిలో వైసీపీ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన పవన్‌కళ్యాణ్‌కు ఆయన నటించిన వకీల్‌సాబ్‌ సినిమాపై ప్రతీకారం రూపంలో అధికార పార్టీ కౌంటర్‌ ఇచ్చింది. దీంతో పవన్‌ కళ్యాణ్‌ సినిమాను టార్గెట్‌ చేసిన వైసీపీకి బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

పవన్‌ కళ్యాణ్‌ నటించిన తాజా చిత్రం వకీల్‌సాబ్‌ టికెట్ల ధరల్ని పెంచుకునేందుకు హైకోర్టు అనుమతించినా వైసీపీ సర్కార్‌ అడుగడుగునా అడ్డుపడటాన్ని జనసేన, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇదే విషయాన్ని టార్గెట్‌ చేస్తూ వైసీపీ సర్కార్‌పై బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వకీల్‌సాబ్‌కు మీరు షాకిస్తే... తిరుపతిలో మీకు ఓటర్లు షాకివ్వబోతున్నారంటూ విష్ణు చేసిన ట్వీట్‌ బీజేపీ నేతల ఆగ్రహాన్ని చెప్పకేనే చెబుతోంది.

ysrcp will get counter shock in tirupati for targetting vakeel saab, says bjp leader vishnu

ఏపీలో వకీల్‌సాబ్‌ సినిమా టికెట్‌ వ్యవహారం కాదు నడుస్తోంది తిరుపతి ఎంపీ టికెట్ ఎన్నికల వ్యవహారం అంటూ బీజేపీ నేత విష్ణు తన ట్వీట్లో విమర్శలు గుప్పించారు. రాజకీయ అంశంగా వకీల్‌సాబ్‌కు సినిమా ద్వారా పవన్ కళ్యాణ గారికి షాకిస్తే17న తిరుపతిలో వైయస్ఆర్ పార్టీ కి ప్రజలు,వారి అభిమానులు మీకు షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి అంటూ విష్ణు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ ట్వీట్‌ను ఇప్పుడు పవన్‌ అభిమానులు వైరల్‌ చేస్తున్నారు.

Recommended Video

    Andhra Pradesh : AP Government continues to haunt Vakeel Saab | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+