student: న్యూడ్ వీడియోతో షాక్ అయిన కాలేజ్ విద్యార్థి, బ్లాక్ మెయిల్ చేసిన శాడిస్టు లేడీ, క్లైమాక్స్ లో?
కాలేజ్ లో చదువుతున్న అబ్బాయి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. కాలేజ్ కు వెలుతున్న యువకుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. అయితే శాడిస్టు లేడీ ఒక్క వీడియోతో ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
బెంగళూరు/మంగళూరు: కాలేజ్ లో చదువుతున్న అబ్బాయి ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. కాలేజ్ కు వెలుతున్న యువకుడు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆ యువకుడు చాలా యాక్టీవ్ గా ఉంటున్నాడు. అయితే ఒక్క వీడియోతో ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
ప్రైవేట్ వీడియో వైరల్ అవుతుందనే భయంతో కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడి తాలూకాలోని ధర్మస్థల సమీపంలోని అశోక్ నగర్ లో మంగళవారం చోటుచేసుకుంది. జిల్లాలోని బెల్తంగడి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న హర్షిత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుర్తుతెలియని యువతి హర్షిత్ కు పరిచయం అయ్యింది. హర్షిత్ కొన్ని రోజుల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో గుర్తుతెలియని యువతితో చాటింగ్ చేస్తున్నాడని సమాచారం. ఈ సమయంలో యువతి రెచ్చగొట్టడంతో హర్షిత్ అసభ్యకరంగా ఆమెతో వీడియో కాల్ లో మాట్లాడాడని తెలిసింది. ఆ సందర్బంలో హర్షిత్ నగ్నంగా మాట్లాడిన అవతలి వ్యక్తి ఆ వీడియోను రికార్డు చేశారు.
తరువాత కాలేజ్ విద్యార్ధి హర్షిత్ కు ఫోన్ చేసిన అవతలి వ్యక్తి నాకు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించడం మొదలు పెట్టారు. నగ్న వీడియో అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చెయ్యడం, అంత డబ్బలు ఇవ్వలేకపోవడంతో డిగ్రీ కాలేజ్ అబ్బాయి హర్షిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. రెచ్చగొట్టి నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడించి బ్లాక్ మెయిల్ చేసి కాలేజ్ విద్యార్థి హర్షిత్ ఆత్మహత్యకు కారణం అయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications