Aunty: మొదటి భార్య జంప్, రెండో భార్య తల నరికి మొండెం వేరు చేసిన భర్త, ఇద్దరు భార్యలతో అదే సమస్య!
బెంగళూరు/ మైసూరు: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో భార్యను చంపేయాలని స్కెచ్ వేశాడు. తనను భర్త చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి కూతురు ఉంది. రెండో భార్య, కూతురితో కలిసి అతను నివాసం ఉంటున్నాడు. రెండో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, తనకు ద్రోహం చేస్తోంది భర్త రగలిపోయాడు.
ఉదయం కూతురు కాలేజ కు వెళ్లింది. ఆ సమయంలో భార్యతో గొడవ పెట్టుకున్న భర్త రగిలిపోయాడు. సహనం లోక్పోయిన భర్త వేటకొడవలి తీసుకుని అతని రెండో భార్య తల పూర్తిగా నరికేసి తల, శరీరం వేర్వేరుగా పడేడయం కలకలం రేపింది.

ఫస్ట్ భార్య మీద డౌట్
కర్ణాటకలోని మైసూరు జిల్లాలోని వరుణ సమీపంలోని చెట్టనహళ్లి గ్రామంలో దేవరాజ్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 24 సంవత్సరాల క్రితం దేవరాజ్ ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత దేవరాజ్ అతని భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో భార్యను చంపేయాలని దేవరాజ్ స్కెచ్ వేశాడు.

రెండో పెళ్లి చేసుకున్న పోటుగాడు
తనను భర్త దేవరాజ్ చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న భార్య 22 ఏళ్ల క్రితం అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. మొదటి భార్య వెళ్లిపోవడంతో సంవత్సరం సైలెంట్ గా ఉన్న దేవరాజ్ 21 ఏళ్ల క్రితం పుట్టమ్మ (42) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్య పుట్టమ్మతో కలిసి సంతోషంగా కాపురం చెయ్యడంతో ఓ కూతురు పుట్టింది.

రెండో భార్య మీద విపరీతమైన అనుమానం
పుట్టమ్మను రెండో పెళ్లి చేసుకున్న దేవరాజ్ కూతురికి ప్రస్తుతం 19 సంవత్సరాలు. రెండో భార్య పుట్టమ్మ, కూతురితో కలిసి దేవారజ్ అతని ఊరిలోనే నివాసం ఉంటున్నాడు. రెండో భార్య పుట్టమ్మ తీరుపై కొంతకాలంగా దేవరాజ్ కు అనుమానం మొదలైయ్యింది. మొదటి భార్య మీద ఎలా డౌట్ పడ్డాడో అంతకంటే ఎక్కువగా రెండో భార్య పుట్టమ్మ మీద దేవరాజ్ అనుమానం పెంచుకున్నాడు.

భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని?
రెండో భార్య పుట్టమ్మ అక్రమ సంబంధం పెట్టుకుందని, తనకు ద్రోహం చేస్తోంది దేవరాజ్ కొంతకాలంగా రగలిపోతున్నాడు. ఉదయం కూతురు కాలేజ్ కు వెళ్లింది. ఆ సందర్బంలో బయట నుంచి ఇంటికి వెళ్లిన దేవరాజ్ అతని రెండో భార్య పుట్టమ్మతో గొడవ పెట్టుకున్నాడు. ఆసందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో సమయంలో భార్యతో గొడవ పెట్టుకున్న భర్త రగిలిపోయాడు.

రెండో భార్య తల తెగనరికేశాడు
సహనం లోక్పోయిన దేవరాజ్ వేటకొడవలి తీసుకుని అతని రెండో భార్య పుట్టమ్మ తల పూర్తిగా నరికేశాడు. పుట్టమ్మ తల, శరీరం వేర్వేరుగా పడేసిన దేవరాజ్ ఇంటి బయట లాక్ చేసుకుని వెళ్లిపోయాడు. కాలేజ్ నుంచి కూతురు ఇంటికి వెళ్లిన తరువాత పుట్టమ్మ హత్యకు గురైన విషయం వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications