Aunty: లవ్ మ్యారేజ్, ఆసుపత్రిలో కూతురిని చూడటానికి వెళ్లిన అత్తను పొడిచిన అల్లుడు, ఎందుకంటే!

బెంగళూరు/మంగళూరు: దూరపు బందువులు అయిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ప్రేమికులు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తరువాత యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిశ్చింది. ఆసుపత్రిలో కూతురి బిడ్డను చూడటానికి వెళ్లిన మహిళను ఆమె అల్లుడు ఆసుపత్రిలోనే కత్తితో దారుణంగా పొడిచేయడం కలకలం రేపింది.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కారవార సమీపంలోని మళియళదరమజాన్ ప్రాంతంలో రఫీక్ షేక్ అలియాస్ రఫీక్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కారావారలోని కధ్రా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఫాతిమా (39) అనే మహిళ రఫీక్ కు దూరపు బందువు అవుతోంది. ఫాతిమాకు రియానా (20) అనే కూతురు ఉంది.

నాలుగు సంవత్సరాల క్రితం ఫాతిమా కూతురు రియానా, రఫీక్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని రఫీక్, రియానా అనుకున్నారు. అయితే జులాయిగా తిరుగుతున్న రఫీక్ కు రియానాను ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ఆమె తల్లిదండ్రులు ఫాతిమా, సలీమ్ నిరాకరించారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో రియానా ఆమె ప్రియుడు రఫీక్ తో పారిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది.

Aunty: Son in law attacks mother in law with knife in government hospital in Krwar in Karnataka

నాలుగు సంవత్సరాల నుంచి భర్త రఫీక్ తో కాపురం చేసిన రియానా గర్బవతి అయ్యింది. కారవారాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రియానాను చేర్పించారు. రియానా ఆడబిడ్డకు జన్మనిశ్చింది. కూతురికి కూతురు పుట్టిందని తెలుసుకున్న ఫాతిమా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వెళ్లింది. కూతురు రియానాను చూడాలని ఫాతిమా ప్రయత్నించింది. ఆ సమయంలో ఆసుపత్రి దగ్గర ఉన్న అల్లుడు రఫీక్ ను మాట్లాడిన ఫాతిమా మీరు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారని, అందరికి తెలిసేలా నిఖా చేసుకోవాలని చెప్పింది.

నువ్వు నీ కూతురు రియానాను చూసి వెళ్లిపోకుండా నాకే నీతులు చెబుతావా అంటూ రెచ్చిపోయిన రఫీక్ కత్తి తీసుకుని అతని అత్త ఫాతిమాను ఆసుపత్రిలోనే దారుణంగా పొడిచేశాడు. కత్తిపోట్లు పడటంతో ఫాతిమాను ఆసుపత్రిలో చేర్పించామని, అత్త మీద కత్తితో దాడి చేసిన రఫీక్ కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+