Bengaluru: మాజీ సీఎంకు షాక్ ఇచ్చిన సుమలత, గవర్నర్ తో భేటీ, అక్రమ మైనింగ్, క్లారిటి !
బెంగళూరు: బహుబాష నటి, కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం ఎంపీ, తెలుగింటి ఆడపడుచు సుమలతా అంబరీష్ కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లేట్ ను కలిశారు. కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సమయంలో స్వతంత్ర పార్టీ ఎంపీ అయిన సుమలతా అంబరీష్ గవర్నర్ థావర్ చంద్ గెహ్లేట్ ను కలుసుకోవడం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది. మాజీ సీఎంకు షాక్ ఇవ్వడానికి, అక్రమ మైనింగ్ వ్యవహారం విషయం గురించి చర్చించడానికి సుమలత గవర్నర్ ను కలిశారు.

గవర్నర్ ను కలిసిన మహిళా ఎంపీ
కొంతకాలంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, స్వతంత్ర పార్టీ ఎంపీ సుమలతా అంబరీష్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి సందర్బంలో శనివారం బెంగళూరులోని రాజ్ భవన్ లో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లేట్ ను కలిసిన ఎంపీ సుమలతా మండ్యలో జరుగుతున్న అక్రమ మైనింగ్ కంపెనీల మీద ఫిర్యాదు చెయ్యడం కలకలం రేపింది.

కేఆర్ఎస్ డ్యామ్ పక్కనే ?
మండ్యలోని ప్రసిద్ది చెందిన కేఆర్ ఎస్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లోనే అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కేఆర్ఎస్ డ్యామ్ లీకేజ్ విషయంలో మండ్య ఎంపీ సుమలత మీద మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి తీవ్రవ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో సుమలత గవర్నర్ ను కలిసి మండ్యలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.
Recommended Video

తెలుగింటి ఆడపడుచు సుమలత క్లారిటి
గర్నవర్ ను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడిన తెలుగింటి ఆడపడుచు, కర్ణాటక కోడలు సుమలత కర్ణాటకకు వచ్చిన గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశానని అన్నారు. మండ్య జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని, కేఆర్ ఎస్ డ్యామ్ సమీపంలో కూడా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని తాను గవర్నర్ కు ఫిర్యాదు చేశానని సుమలత అన్నారు. ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటామని గవర్నర్ థావర్ చంద్ గెహ్లేట్ హామీ ఇచ్చారని స్వతంత్ర పార్టీ ఎంపీ సుమలత మీడియాకు చెప్పారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications