ఊపిరి పీల్చుకున్న ఉద్యాననగరి..!

Bengaluru rains: బెంగళూరు బెంగ తీరిపోయింది. ఎట్టకేలకు వరుణదేవుడు ఈ ఉద్యాననగరిని పలకరించాడు. రెండు రోజులుగా బెంగళూరులో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతోంది. దాదాపుగా 150 రోజుల తరువాత బెంగళూరులో వర్షం కురవడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బెంగళూరు శివారు ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వైట్ ఫీల్డ్, వర్తూరు, సర్జాపురా రోడ్, మార్థహళ్లి, బెళ్లందూరు, బొమ్మనహళ్లి, బీటీఎం లే అవుట్, జయనగర, కోరమంగళ, జేపీ నగర, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, బనశంకరి, ఉత్తరహళ్లి, రాజరాజేశ్వరి నగర, కెంగేరి, మైసూరు రోడ్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

Bengaluru sees its first Rain after 150 days

ప్రతి సంవత్సరం కూడా మార్చి/ఏప్రిల్ ప్రారంభంలోనే బెంగళూరులో చెప్పుకోదగ్గ వర్షాలు పడేవి. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. ఈ ఏడాది కూడా అంచనాలు తప్పాయి. గతంలో బెంగళూరులో ఎప్పుడూ లేనంతగా ఎండ తీవ్రత నమోదవుతూ వచ్చింది ఇన్ని రోజులు. అత్యధికంగా 38-39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైన సందర్భాలు ఉన్నాయి.

ఏప్రిల్‌లోనే ఈ స్థాయిలో ఎండ తీవ్రత ఉంటే మే లో 40 డిగ్రీలను దాటిపోవచ్చనే అంచనాలు బెంగళూరియన్లను ఆందోళనకు గురి చేశాయి. గత సీజన్‌లో సరైన వర్షాలు పడకపోవడం వల్ల నీటి కొరత సైతం ఏర్పడిన విషయం తెలిసిందే. భూగర్భ జలాలు అడుగంటాయి. బెంగళూరు సిటీతో పాటు శివార్లల్లో ఉన్న చెరువులు ఎండిపోయాయి. అనేక ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది.

ఈ పరిస్థితుల్లో బెంగళూరులో ఓ మోస్తరు వర్షాలు పడటం ఊరట కలిగించినట్టయింది. తమ ప్రాంతంలో వర్షాలు పడటాన్ని మొబైల్ ఫోన్ల ద్వారా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోన్నారు బెంగళూరియన్లు. #bengalururains అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.

అటు రాష్ట్రవ్యాప్తంగా కూడా మంచి వర్షాలు పడుతున్నాయి. ఈ ఉదయం 8:30 గంటల వరకు వివిధ జిల్లాల్లో పడిన వర్షపాతం వివరాలను కర్ణాటక వెదర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. దీని ప్రకారం చూస్తే- ఉడుపి జిల్లాలో అత్యధికంగా 155 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

ఉత్తర కన్నడ- 146, దక్షిణ కన్నడ- 113, చిక్‌మగళూరు- 94, దావణగెరె- 87, హాసన్- 87, శివమొగ్గ- 77, విజయపుర- 58, బీదర్- 56, కొప్పల్- 45, గదగ్- 33, మండ్య- 32, బళ్లారి- 31, తుంకూరు- 30, బెళగావి- 29, మైసూరు- 26, కొడగు- 25, రామనగర- 19, బెంగళూరు రూరల్- 16, చామరాజనగర- 11, బెంగళూరు అర్బన్- 9 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+