Boyfriend : మైనర్ అమ్మాయితో లవ్, బంధువులు, ప్రియురాలి బాబాయ్ రౌడీ, కట్!
బెంగళూరు: సమీప బంధువు అయిన మైనర్ అమ్మాయి మీద ఓ యువకుడు మనసు పారేసుకున్నాడు. ఇంతకాలం అప్పుడప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అమ్మాయి బంధువు కావడంతో ఆమెను ప్రేమించాలని అనుకున్న ఆ యువకుడు ఆమెతో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తున్నాడు. ఒక్కరోజు ఐలవ్ యూ అంటూ ఆమెకు మెసేజ్ పంపించాడు. ఆమె కూడా ఆ అబ్బాయికి ఐలవ్ యూ టూ అంటూ రిప్లే ఇచ్చింది. నా ప్రేమ ఫలించింది అంటూ ఆ యువకుడు ఎగిరిగంతేశాడు.
కొంతకాలం మైనర్ అమ్మాయి, అబ్బాయి చాటింగ్ చేసుకుంటూనే ఉన్నారు. ఇదే సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురైనాడు. యువకుడి హత్య కేసులో ఓ రౌడీషీటర్, అతని స్నేహితుడు అరెస్టు కావడంతో కథ కొత్త మలుపుతిరిగింది.

అన్నకు సహాయం చేస్తున్నాడు
బెంగళూరులోని పాత మద్రాసు రోడ్డులో ప్రజ్వల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రజ్వల్ అతని సోదరుడికి పనిలో సహాయం చేస్తున్నాడు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ స్నేహితులతో కలిసి ప్రజ్వల్ కొంతకాలం క్రితం వరకు చాలా సంతోషంగా జీవించాడు.

మైనర్ అమ్మాయి
ప్రజ్వల్ కు సమీప బంధువు అయిన అమ్మాయి ఇటీవల క్లోజ్ అయ్యింది. అయితే ప్రజ్వల్ సమీప బంధువు అయిన అమ్మాయి మైనర్. కొంతకాలం క్రితం ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్న ప్రజ్వల్ ఆమెతో సోషల్ మీడియాలో చాటింగ్ చేశాడు. మైనర్ అమ్మాయి కూడా ప్రజ్వల్ తో చాటింగ్ చేసిందని తెలిసింది.

బంధువుల అమ్మాయితో లవ్
ఇంతకాలం అప్పుడప్పుడు ఆ అమ్మాయితో ప్రజ్వల్ మాట్లాడుతున్నాడు. అమ్మాయి బంధువు కావడంతో ఆమెను ప్రేమించాలని అనుకున్న ప్రజ్వల్ ఆమెతో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తున్నాడు. ఇటీవల ప్రజ్వల్ ఐలవ్ యూ అంటూ ఆమెకు మెసేజ్ పంపించాడు. ఆ అమ్మాయి కూడా ప్రజ్వల్ కు ఐలవ్ యూ టూ అంటూ రిప్లే ఇచ్చింది. నా ప్రేమ ఫలించింది అంటూ ప్రజ్వల్ ఎగిరిగంతేశాడు.

అమ్మాయి చిన్నాన పాత రౌడీషీటర్
మైనర్ అమ్మాయి సొంత చిన్నాన నాగేంద్ర పాత రౌడీషీటర్. పోలీసు కేసులతో జైలు, కోర్టు అంటూ ఇంతకాలం తిరిగిన నాగేంద్ర ఇటీవల కొంచెం సైలెంట్ అయ్యాడని తెలిసింది. మైనర్ అమ్మాయి, ప్రజ్వల్ మ్యాటర్ నాగేంద్రకు తెలిసింది. ఈనెల 15వ తేదీన నాగేంద్ర, అతని స్నేహితుడు రంగస్వామి ఓ యువకుడి సహాయంతో ప్రజ్వల్ ను పాత మద్రాలసు రోడ్డులోని బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్జనప్రదేశంలోకి పిలిపించారు. ఆ సందర్బంలో పాత రౌడీషీటర్ నాగేంద్ర, రంగస్వామి కలిసి పెద్ద కర్రలు తీసుకుని ప్రజ్వల్, అతని స్నేహితులను చితకబాదేశారు.

ప్రేమ కోసం యువకుడి ప్రాణం పోయింది
తీవ్రగాయాలైన ప్రేమికుడు ప్రజ్వల్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలేశాడు. ప్రజ్వల్ శవాన్ని రోడ్డు పక్కన విసిరేసిన నాగేంద్ర, రంగస్వామి పరారైనారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేస్తే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. మైనర్ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో ప్రజ్వల్ ను అతని సమీప బంధువు నాగేంద్ర, అతని స్నేహితుడు రంగస్వామి హత్య చేశారని వెలుగు చూడటంతో ఇద్దరిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications