లైంగిక వేధింపులు: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్, అతని తండ్రి రేవన్నపై కేసు నమోదు

బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ అగ్రనేత దేవెగౌడ తనయుడు రేవన్న (Revanna)తోపాటు ఆయన మనవడు ఎంపీ ప్రజ్వల్ రేవన్నలపై పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు హోలెనరసిపూర్ పోలీసులు ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మరోవైపు, ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో సిట్ ను ఏర్పాటు చేయాలని అంతకుముందు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ప్రభుత్వానికి లేఖ రాసింది.

Case against Karnataka MP prajwal father Revanna for sex harassment of house help

లోక్‌సభ ఎన్నికలో భాగంగా హసన్ స్థానం నుంచి జేడీఎస్ తరపున ప్రజ్వల్ మరోసారి బరిలో దిగారు. కాగా, ఏప్రిల్ 26నే ఈ స్థానానికి పోలింగ్ ముగిసింది. అయితే, పోలింగ్ కు ముందు నుంచే ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలు హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజ్వల్ ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. రేవన్న పేరు చెడగొట్టడానికే కొంత మంది కలిసి ఈ వీడియో క్లిప్‌లను వ్యాప్తి చేశారని జేడీఎస్-బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ పూర్ణచంద్ర గౌడ్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+