కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సినిమా చూపించిన ఐటీ శాఖ, ఎలక్షన్ టైమ్ లో గులాబ్ జామ్!

బెంగళూరు/ధారవాడ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలు నియోజక వర్గాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. బీజేపీ నాయకుడి హత్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయట ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడి సన్నిహితుడి ఇంటి మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ధారవాడ గ్రామీణ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి వినయ్ కులకర్ణి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నాయకుడి హత్య కేసులో వినయ్ కులకర్ణి అరెస్టు అయ్యి జైలుకు వెళ్లాడు. ధారవాడ జిల్లాలో అడుగుపెట్టకూడదని షరతులు పెట్టిన కోర్టు వినయ్ కులకర్ణికి బెయిల్ మంజూరు చేసింది.

Dharwada Rural Congress Party candidate Vinay Kulkarni PAs house searched by IT department officials

హత్య కేసులో బెయిల్ మీద బయట ఉన్న వినయ్ కులకర్ణిని సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద పోటీలో నిలపాలని మొదట కాంగ్రెస్ పార్టీ నాయకులు బావించారు. అయితే చివరి నిమిషంలో ధారవాడ గ్రామీణ నియోజక వర్గం సీటు వినయ్ కులకర్ణికి ఇచ్చారు. తాను ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి ధారవాడ వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని వినయ్ కులకర్ణి కోర్టును ఆశ్రయించాడు.

అయితే కోర్టు మాత్రం వినయ్ కులకర్ణిని ధారవాడ జిల్లాలో అడుగుపెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. ధారవాడ జిల్లా బయట ఉంటున్న వినయ్ కులకర్ణి ఆయన భార్య, బంధువులు, స్నేహితుల సహాయంతో ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ వినయ్ కులకర్ణికి అత్యంత సన్నిహితుడు, ఆయనకు పీఏగా పని చేస్తున్న ప్రశాంత్ ఇంటి మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు.

గురువారం ధారవాడలోని వినయ్ కులకర్ణి పీఏ అయిన ప్రశాంత్ ఇంటికి వెళ్లిన ఐటీ శాఖ అధికారులు ఇంటి తాళాలు ఇప్పించుకుని సోదాలు చేశారు. తరువాత ప్రశాంత్ ను ఐటీ శాఖ అధికారులు పిలుచుకుని వెళ్లారని ప్రశాంత్ సన్నిహితులు అంటున్నారు. బీజేపీ నాయకులు తన మీద కక్ష సాధించడానికి తన పీఏ ప్రశాంత్ ఇంటి మీద ఐటీ శాఖ అధికారులతో దాడులు చేయించారని, తాను ఎవ్వరికి భయపడను అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు వినయ్ కులకర్ణి మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+