Drugs racket: సీఎం కొడుకుతో నటి రాగిణి, ఫోటోలు, వీడియోలు వైరల్, ఆ రోజు అదే లింక్, శివశివ !

బెంగళూరు/ న్యూఢిల్లీ: స్యాండిల్ వుడ్ తో పాటు కర్ణాటకను కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడికి పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఫేమస్ నటి రాగిణి ద్వివేదిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కొడుకు బీవై. విజయేంద్రతో కలిసి నటి రాగిణి ద్వివేది తీసుకున్న ఫోటో తెరమీదకు రావడంతో కలకలం రేపింది. ఆ రోజు సీఎం కొడుకు, నటి రాగిణి ఎలా ఫోటోలు తీసుకున్నా ఈ రోజు తలనొప్పి మాత్రం బీజేపీ నాయకులకు వచ్చింది. బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కస్టడీలో ఉన్న నటి రాగిణి విషయంలో ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి ? అంటూ బీజేపీ నాయకులు హడలిపోతున్నారు.

 బీజేపీ లీడర్స్ తో రాగిణి చర్చలు ?

బీజేపీ లీడర్స్ తో రాగిణి చర్చలు ?

డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నటి రాగిణి ద్వివేది కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నాయకులతో చర్చించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో బీజేపీ ఉపాధ్యక్షుడు అయిన సీఎం కొడుకు బీవై. విజయేంద్రతో నటి రాగిణి కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రాగిణి కేసు నుంచి తప్పించుకోవడానికి బీజేపీ నాయకులతో చర్చించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే బీజేపీ నాయకులతో రాగిణి ఎలాంటి చర్చలు జరపలేదని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.

దంచికొట్టిన నటి రాగిణి ద్వివేది

దంచికొట్టిన నటి రాగిణి ద్వివేది

మత్తుపదార్థాలకు బానిసలు కాకూడదు అంటూ బీజేపీ నాయకులు ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో నటి రాగిణి తన ప్రంసగంతో దచ్చికొట్టి వదిలేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని పిలుపునిస్తూ బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఓ చర్చాగోష్టి కార్యక్రమంలో నటి రాగిణి ద్వివేది పిచ్చపాటిగా మాట్లాడటమే కాకుండా నేటి యువతికి సందేశాలు ఇచ్చిన విషయాన్నిప్రతిపక్ష నాయకులు గుర్తు చేస్తున్నారు.

 బీజేపీ స్టార్ ప్రచారకర్త రాగిణి

బీజేపీ స్టార్ ప్రచారకర్త రాగిణి

2019లో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకముందు ఆపరేషన్ కమల దెబ్బకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఆ సందర్బంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామా చెయ్యడంతో కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల సందర్బంగా నటి రాగిణి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఉప ఎన్నికలు జరిగిన నియోజక వర్గాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. బీజేపీ నాయకులు అప్పగించిన పనిని నటి రాగిణి ద్వివేది తూచా తప్పకుండా పాటించి ఇంటింటి ప్రచారం చేసి ఆ పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి భాగం అయ్యింది.

రాగిణికి మంగళ హారతి..... వీడియో వైరల్

మండ్య జిల్లాలోని కేఆర్ పేట ఉప ఎన్నికల్లో (2019) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారాయగౌడను గెలిపించాలని నటి రాగిణి ఇంటింటి ప్రచారం చేసింది. కేఆర్ పేట నియోజక వర్గంలో నారాయణగౌడను గెలిపించే బాధ్యతను కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై, విజయేంద్ర అప్పట్లో భుజాలకు ఎత్తుకున్నారు. సీఎం కొడుకు బీవై. విజయేంద్రతో కలిసి నటి రాగిణి ఇంటింటి ప్రచారం చేసిన సమయంలో స్థానిక మహిళలు స్టార్ హీరోయిన్ రాగిణికి మంగళ హారతులు ఇచ్చి, నుదట కుంకుమ పెట్టి పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. సీఎం కొడుకు బీవై. విజయేంద్ర, నటి రాగిణి కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు బయటకు రావడంతో అవి వైరల్ అయ్యాయి.

డ్రగ్స్ పై బీజేపీ పోరాటం

డ్రగ్స్ పై బీజేపీ పోరాటం

పాఠశాల, కళాశాల విద్యార్థులు డ్రగ్స్ కు, మత్తుపదార్థాలకు దూరం కావాలంటూ కొంతకాలం క్రితం బీజేపీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సమయంలో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో నటి రాగిణి సైతం పాల్గొని మీరు డ్రగ్స్ కు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ విద్యార్థులకు పెద్ద ఎత్తున ఉపదేశం చేశారు. అయితే మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని నటి రాగిణి పిలుపునిచ్చిన వీడియో ఇప్పుడు ఆమె అదే డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సమయంలో బయటకు రావడంతో బీజేపీ నాయకులు ఇరకాటంలో పడ్డారు.

Recommended Video

    Lok Sabha Election 2019 : సుమలత కోసం క్లైమాక్స్ లో సూపర్ స్టార్ ఎంట్రీ! || Oneindia Telugu
    కేసు ఏదైనా సమస్య వచ్చింది కదా ?

    కేసు ఏదైనా సమస్య వచ్చింది కదా ?

    ప్రస్తుతం కేసు ఎదైనా నటి రాగిణి ద్వివేది, సీఎం కొడుకు కలిసి ఉన్న ఫోటో ఇలాంటి సమయంలో బయటకు రావడంతో బీజేపీ నాయకులు అయోమయంలో పడిపోయారు. ఇప్పటికే బీవై. విజయేంద్ర సూపర్ సీఎంగా చలామణి అవుతున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపిస్తున్న సమయంలో ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి రాగిణితో కలిసి ఆయన ఎప్పుడో తీసుకున్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో బీజేపీ నాయకులు హడలిపోతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+