Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

DKS: ట్రుబల్ షూటర్ కు ట్రబుల్, 39 years ఇండస్ట్రీ ఇక్కడ, చరిత్ర చెప్పి బ్యాంక్ స్టేట్ మెంట్ ఇవ్వండి !

న్యూఢిల్లీ/బెంగళూరు: అక్రమంగా నగదు లావాదేవీలకు పాల్పడ్డారని, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరైనారు. ఆరు గంటల పాటు డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. 39 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు మీ ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీల పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కు ఆదేశాలు జారీ చేశారు. 39 సంవత్సరాల క్రితం డీకే శివకుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎన్ని రూ. కోట్లు ?, ప్రస్తుతం ఆయన ఆస్తులు ఎన్ని రూ. కోట్లు ?, ఈ మద్య కాలంలో డీకే శివకుమార్ కు, ఆయన ఫ్యామిలీకి ఏ విదంగా అన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి ? అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

ఐటీ అధికారుల దెబ్బ

ఐటీ అధికారుల దెబ్బ

2017 ఆగస్టు 2వ తేదీన ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు డీకే శివుమార్, ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారి నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. రూ. 374 కోట్ట ఆస్తులు ఉన్నాయని అధికారికంగా ప్రకటించిన డీకే శివకుమార్ ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, అక్రమంగా ఆస్తులు సంపాధించారని అప్పట్లో మూడు కేసులు నమోదు అయ్యాయి.

ఈడీ అధికారులు ఎంట్రీ

ఈడీ అధికారులు ఎంట్రీ


ఆదాయపన్ను శాఖ అధికారులు ఇచ్చిన సమాచారం మూరకు 2019 సెప్టెంబర్ 3వ తేదీన ఈడీ అధికారులు డీకే. శివకుమార్ ను అరెస్టు చేశారు. డీకే. శివకుమార్ అక్రమంగా ఆస్తులు సంపాధించారని, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, ఆయన మీద సీబీఐతో విచారణ .జరిపించాలని ఐటీ శాఖ, ఈడీ అధికారులు ప్రభుత్వానికి శిఫారస్సు చేశారు.

సీబీఐ ఎంట్రీతో షాక్

సీబీఐ ఎంట్రీతో షాక్

2013 ఏప్రిల్ నుంచి 2018 ఏప్రిల్ 30వ తేదీ మద్య కాలంలో డీకే శివకుమార్ అక్రమంగా ఆస్తులు సంపాధించారని, ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2020 మార్చిలో సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. డీకే శివకుమార్ అక్రమంగా రూ. 74.93 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు సంపాధించారని సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అక్రమ ఆస్తులు రూ. ఎన్నికోట్లు అంటే ?

అక్రమ ఆస్తులు రూ. ఎన్నికోట్లు అంటే ?

విచారణ ప్రారంభం కాకముందు డీకే శివకుమార్ కుటుంబం రూ. 33. 92 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, ఐదు సంవత్సరాల్లో రూ. 166.79 కోట్లు ఆస్తులు సంపాధించారని అధికారులు ఆరోపిస్తున్నారు. వివిదరూపాల్లో డీకే శివకుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులు రూ. 113.12 కోట్లు పెంచుకున్నారని ఎఫ్ఐఆర్ లో వివరాలు నమోదు చేశారు.

ట్రబుల్ షూటర్ కు ట్రబుల్

ట్రబుల్ షూటర్ కు ట్రబుల్


ఈ కేసుల్లో రెండో కేసుకు సంబంధించి గత వారంలో ఈడీ అధికారులు డీకే శివకుమార్ కు సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈడీ అధికారుల ఆదేశాలతో సోమవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారుల ముందు డీకే. శివకుమార్ హాజరైనారు. తనకు ఎందుకు సమన్లు జారీ చేశారు అనే విషయం తెలియడం లేదని అంతకు ముందే డీకే. శివకుమార్ మీడియాకు చెప్పారు.

 39 ఏళ్ల చరిత్ర మొత్తం చెప్పండి

39 ఏళ్ల చరిత్ర మొత్తం చెప్పండి

ఆరు గంటల పాటు డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. 39 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు మీ ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీల పూర్తి వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు ఆదేశాలు జారీ చేశారు.

పిన్ టూ పిన్ ఇవ్వాలి

పిన్ టూ పిన్ ఇవ్వాలి

39 సంవత్సరాల క్రితం డీకే శివకుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులు ఎన్ని రూ. కోట్లు ?, ప్రస్తుతం ఆయన ఆస్తులు ఎన్ని రూ. కోట్లు ?, ఈ మద్య కాలంలో డీకే శివకుమార్ కు, ఆయన ఫ్యామిలీకి ఏ విదంగా అన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చాయి ? అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+