Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: ప్రియురాలి హత్య కేసులో ట్విస్ట్, లిక్కర్, విషం బాటిల్స్, మధ్యలో ఏం జరిగింది, ఎక్కడికి వెళ్లి?

బెంగళూరు/కొడుగు: కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్‌పేట తాలూకాలోని నంగలలో యువతిని హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తిమ్మయ్య అనే యువకుడు ఆ హత్య జరిగిన కొన్ని రోజుల తరువాత శవమై కనిపించాడు.

నంగలకు చెందిన మాదప్ప కుమార్తె ఆర్తీ (24) ఆదివారం రాత్రి ఆమె ఇంటిలోనే హత్యకు గురైంది. ఆర్తీ హత్య అనంతరం బిట్టంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని రుద్రగుప్పెకు చెందిన నానయ్య, విమల దంపతుల కుమారుడు తిమ్మయ్య ఆర్తీని హత్య చేశాడని ఆరోపిస్తూ కేసు నమోదు అయ్యింది.

ఆర్తీని హత్య చేసి ఇంటికి వెళ్లిన తిమ్మయ్య తన రక్తపు జాకెట్‌ను ఇంటి సమీపంలో రోడ్డుపై పడేశాడు. తిమ్మయ్య జాక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తిమ్మయ్య మద్యం సేవించి వ్యవసాయ పొలంలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యవసాయ బావి గుంత దగ్గర తిమ్మయ్య చెప్పులు, మద్యం సీసా, విషం బాటిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Ex boyfriend escape in case of murder of young woman, ex-boyfriend found dead in well in Karnataka

ఆర్తీని హత్య చేసిన తరువాత తిమ్మయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వ్యవసాయ బావిలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. రోజంతా వెతికినా తిమ్మయ్య ఆచూకీ లభించలేదు. అనంతరం జేసీబీతో వ్యవసాయ బావిలో పూడు తీసి నీటిని బయటకు పారబోశారు. గ్రామస్తులందరూ కలిసి మోటారు పంపులను ఉపయోగించి బావిలోని నీటిని చాలా వరకు ఖాళీ చేశారు. ఇలా వెతికిన పోలీసులకు మంగళవారం అర్ధరాత్రి వరకు పొలం గుంతలో తిమ్మయ్య ఆనవాళ్లు కనిపించలేదు. అందుకే తిమ్మయ్య ఇంకా బావిలో పడలేదని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినవారూ ఉన్నారు.

బుధవారం వ్యవసాయ బావిలో తిమ్మయ్య కాలు గుర్తించారు. తరువాత మొత్తం తొవ్వి చూడగా తిమ్మయ్య మృతదేహం బయటకు వచ్చింది. తిమ్మయ్య మృత దేహాన్ని విరాజ్‌పేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై విరాజ్‌పేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

తిమ్మయ్య మంచివాడని, గ్రామస్థులతో మంచిగా, చాలా సహవాసంగా ఉంటున్నాడని స్థానికులు అంటున్నారు, తిమ్మయ్యను హత్య చేసి శవాన్ని బావిలో విసిరేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తిమ్మయ్య వ్యవసాయ బావిలో శవమై కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఆర్తీ అనే యువతి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తిమ్మయ్య ఆత్మహత్యతో కలకలం రేపింది. ఆర్తీ, తిమ్మయ్య కుటుంబాలు తమ పిల్లలను పోగొట్టుకుని విలపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+