EX lover:లవర్స్ బ్రేకప్, మాజీ గర్ల్ ఇంటికి వెళ్లి ఏమి అడిగాడంటే ?, భర్తకు కాలిపోయి కత్తి, కత్తెరతో కట్, ఫినిష్

బెంగళూరు: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. రెండు సంవత్సరాల పాటు ప్రేమికులు సంతోషంగా తిరిగారు. రానురాను ప్రేమికుల మద్య తేడాలు రావడంతో విడిపోయారు. వేరే యువకుడితో వివాహం చేసుకున్న ప్రియురాలు కాపురం చేస్తోంది. యువతి మాజీ ప్రేమికుడు ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి నాతో వచ్చేయాలని, లేదంటే నాతో అక్రమ సంబంధం పెట్టుకుని నాకు పడక సుఖం ఇవ్వాలని మాజీ ప్రియురాలిని టార్చర్ పెట్టాడు. కొంతకాలంగా మాజీ ప్రియుడు, ప్రియురాలి భర్తకు ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

మాజీ ప్రియురాలి ఇంటి దగ్గరకు వెళ్లిన ప్రియుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెను బయటకు లాక్కొని వెళ్లాలని ప్రయత్నించాడు. ఆ సందర్బంలో జరిగిన గొడవలో భర్త అతని భార్య మాజీ ప్రియుడిని కత్తి, కత్తెరతో పొడిచి చంపేయడం కలకలం రేపింది. మాజీ ప్రియురాలిని, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఒకే ఏరియాలో ప్రేమికులు

ఒకే ఏరియాలో ప్రేమికులు

బెంగళూరు నగరంలోని శివాజీనగర్ లో జావద్ ఖాన్ అలియాస్ జావెద్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. శివాజీనగర్ లోనే నివాసం ఉంటున్న సిమ్రాన్ (24) అనే యువతికి, జావద్ కు పరిచయం అయ్యింది. జావెద్, సిమ్రాన్ ల పరిచయం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు ప్రేమికులు జావెదన్, సిమ్రాన్ సంతోషంగా తిరిగి ఎంజాయ్ చేశారు.

ప్రియుడితో బ్రేకప్..... వేరే యువకుడితో పెళ్లి

ప్రియుడితో బ్రేకప్..... వేరే యువకుడితో పెళ్లి

శివాజీనగర్ లోని రసూల్ మార్కెట్ దగ్గర జావెద్ ఏసీ మెకానిక్ గా పని చేస్తున్నాడు. కొన్ని విషయాల్లో రానురాను ప్రేమికులు జావెద్, సిమ్రాన్ మద్య తేడాలు రావడం మొదలైనాయి. కొంతకాలం కలిసి ఉండటం తరువాత దూరంగా ఉండటం జరిగింది. చివరికి ప్రేమికులు జావెద్, సిమ్రాన్ విడిపోయా కొంతకాలం ఎవరిపాటికి వాళ్లు జీవించారు.

అక్రమ సంబంధం పెట్టుకోవాలని మాజీ ప్రియుడి పంచాయితీలు

అక్రమ సంబంధం పెట్టుకోవాలని మాజీ ప్రియుడి పంచాయితీలు

ప్రియుడు జావెద్ తో విడిపోయిన తరువాత సిమ్రాన్ శివాజీనగర్ లోనే నివాసం ఉంటున్న జిహాన్ అనే యువకుడితో వివాహం చేసుకుని శివాజీనగర్ లోనే కాపురం చేస్తోంది. సిమ్రాన్ మాజీ ప్రేమికుడు జావెద్ ఆమె ఇంటి దగ్గరకు వెళ్లి నీ భర్త జీహాన్ ను వదిలేసి నాతో వచ్చేయాలని, లేదంటే నాతో అక్రమ సంబంధం పెట్టుకుని నాకు పడక సుఖం ఇవ్వాలని మాజీ ప్రియురాలిని టార్చర్ పెట్టాడు.

విసిగిపోయిన మాజీ ప్రియురాలు

విసిగిపోయిన మాజీ ప్రియురాలు

కొంతకాలంగా మాజీ ప్రియుడు జావెద్ ఎప్పుడంటే అప్పుడు సిమ్రాన్ ఇంటి దగ్గరకు వెళ్లి ఇదే పంచాయితీ పెట్టడం చేస్తున్నాడు. ఇదే విషయంలో జావెద్ కు, అతని మాజీ ప్రియురాలు సిమ్రాన్ భర్త జీహాన్ కు ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. మాజీ ప్రియురాలు సిమ్రాన్ ఇంటి దగ్గరకు వెళ్లిన మాజీ ప్రియుడు జావెద్ రచ్చరచ్చ చేశాడు.

మాజీ ప్రియుడి ప్రాణం పోయింది

మాజీ ప్రియుడి ప్రాణం పోయింది

సిమ్రాన్ ఇంటి దగ్గరకు వెళ్లిన జావెద్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెను బయటకు లాక్కొని వెళ్లాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో సిమ్రాన్ భర్త జీహాన్ అడ్డుపడటంతో పెద్ద గొడవ జరిగింది. ఆ సందర్బంలో సిమ్రాన్ భర్త జీహాన్ సహనం కోల్పోయి కత్తి, కత్తెర తీసుకుని జావెద్ గొంతులో పొడిచేశాడు. తీవ్రగాయాలైన జావెద్ సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి దగ్గరకు వెళ్లి కుప్పకూలిపోయాడు. అప్పటికే జావెద్ ప్రాణం పోయిందని గుర్తించిన వైద్యులు శివాజీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సిమ్రాన్, ఆమె భర్త జీహాన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+