డీకే శివకుమార్ అన్ని గుర్రాలు స్వారీలో కింగ్, గ్రేట్ అంటున్న బీజేపీ మాజీ సీఎం!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. అధికారం దూరం చేసుకుని ప్రతిపక్షానికి పరిమితం అయిన బీజేపీ నాయకులు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ పవర్ ఫుల్ లీడర్ అని, ఆయన గుర్రుపు స్వారీలు చెయ్యడంలో కింగ్ అని మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బసవరాజ్ బోమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇచ్చిన గుర్రం స్వారీ చేసిన వ్యక్తి ధీరుడు, సూరుడు అని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. అయితే డీకే శివకుమార్ కు ఇచ్చిన అన్ని గుర్రాల మీద విజయవంతంగా స్వారీ చేశారని, ఆయన ఇంకా ఎన్ని గుర్రపు స్వారీలు చేస్తారో వేచి చూడాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

డీకే. శివకుమార్ అనే వ్యక్తి ఎన్ని గుర్రాలు అయినా స్వారీ చేస్తారని, ఆ సత్తా ఆయనకు ఉందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. డీకే శివకుమార్ కు ఇంతకాలం మంచి గుర్రాలు చిక్కాయని, ఇక ముందు ఎలాంటి గుర్రం చిక్కుతుందో అని తాము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం!
ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయిన డీకే శివకుమార్ ను బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఇలా పొగడటం ఇప్పుడు రెండు పార్టీల్లో పాటు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. డీకే శివకుమార్ ఇటీవల మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఇంటికి నేరుగా వెళ్లిపోయి ఆయనతో చర్చలు జరిపారు.

రాజకీయాల్లో ముందుముందు ఏమైనా జరగవచ్చు. మనకు ఎవ్వరూ పవర్, పదవులు ఇవ్వరని, మనకి మనమే పదవులు సంపాధించుకోవాలని, అలా చెయ్యడంలో ఇంతకాలం డీకే శివకుమార్ విజయం సాధించారని తాను అనుకుంటున్నానని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. అయితే డీకే. శివకుమార్ ను మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ పొగడటం చూస్తే వింతగా ఉందని బీజేపీ సీనియర్ నాయకుడు, విజయపుర బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ మండిపడుతున్నారు.













Click it and Unblock the Notifications