టమోటాల కోసం కత్తులతో పొడుచుకున్న ఫ్రెండ్స్, అసలు మ్యాటర్!
బెంగళూరు/రాయచూరు: ధరలు లేవని రోడ్ల పక్కన రైతులు టన్నులు టన్నులు టమోటాలు విసిరేసి వెళ్లిపోయిన సంఘటనలు మనం చాలానే చేశాము, టమోటా పంటలు వేసి ధరలు లేకపోవడం, టమోటాలు కోసి వాటిని మార్కెట్ కు తరలిస్తే కనీసం కూలిపాటు కూడా గిట్టడం లేదని ఇంతకు ముందు రైతులు లబోదిబో అన్న విషయం తెలిసిందే.
భార్యను చంపేసి ఆమె తెలివైన మెదడు, మాంసం తినేసిన భర్త, మ్యాటర్ మాత్రం!
అయితే ఇప్పుడు టమోటాలకు బంగారం ధరలు పలుకుతున్నాయి. కేజీ టమోటాలు వంద రూపాయలకు పైగా పలుకుతున్నాయి. టమోటాలు పంటలు పెట్టిన రైతులు ఇప్పుడు కళ్లు కాయలు కాసేలా కాపలా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా టమోటాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కేజీ టమోటాలు తీసుకునే బదులు కేజీ చికెన్ తీసుకుంటే సరిపోతుందని చాలా మంది అనుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నుంచి వివిద రాష్ట్రాలకు టమోటాలు ఎగుమతి అవుతున్నాయి. టమోటాలతో పాటు దాదాపుగా అన్ని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. టమోటా ధరలు పెరిగిపోవడంతో రైతులు హ్యాపీగా ఉన్నా సామాన్య ప్రజలు మాత్రం టమోటాలు కొనుగోలు చెయ్యలేక సతమతం అయిపోతున్నారు. టమోటా పంట విషయంలో ఇద్దరు స్నేహితులు గొడవపడి కత్తులతో పొడుచుకున్నారు.
కర్ణాటకలోని రాయచూరు జల్లాలోని మాన్విలో రఫి, అబ్దుల్ అనే ఇద్దరు స్నేహితులు కలిసి టమోట పంట పెట్టారు. టమోటాలకు విపరీతమైన డిమాండ్ ఉండటం, కేజీ వంద రూపాయలకు పైగా వెలుతుండటంతో రఫి, అబ్దుల్ టమోటాలు విక్రయిస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. మంగళవారం అబ్దుల్ లేని సమయంలో టమోటలు కోసిన రఫి వాటిని సీక్రేట్ గా టమాటా మార్కెట్ కు తరలించాడు.
విషయం తెలుసుకున్న అబ్దుల్ మార్కెట్ యార్డుకు చేరుకున్నాడు. ఆ సందర్బంలో తనకు తెలీకుండా ఎందుకు టమోటాలు కోసుకుని తీసుకు వచ్చావు అంటూ అబ్దుల్ అతని స్నేహితుడు రఫితో గొడవపడ్డాడు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన అబ్దుల్ కత్తి తీసుకుని రఫీని ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. తీవ్రగాయాలైన రఫీ మాన్వి ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. టమోటాల విషయంలో యువకుడిని అతని స్నేహితుడు కత్తితో దారుణంగా పొడిచేయడంతో ఆ ప్రాంతంలో ప్రజలు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications