Marriage: పెళ్లికూతురి పర్సనల్ ఫోటోలు పెళ్లి కొడుకు తండ్రికి చిక్కాయి, ఏందిరా, నా కొడుకు సెకండ్ హ్యాండా?
బెంగళూరు: కూతురికి పెళ్లి చెయ్యాలని దంపతులు డిసైడ్ అయ్యారు. బంధువులు ఓ పెళ్లి సంబంధం సెట్ చేశారు. పెళ్లి చేసుకోవడానికి కూతురు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో యువతి, యువకుడి నిశ్చితార్థం జరిగిపోయింది. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. అయితే పెళ్లి కొడుకు తండ్రి ఓ ఫోటో తీసుకుని పెళ్లి కూతురి తండ్రి దగ్గరకు వెళ్లాడు.
ఏందిరా నువ్వు చేస్తున్న పని, నీ కూతురు ఎవరితోనో తిరిగి ఎంజాయ్ చేసి ఫోటోలు, వీడియోలు తీసుకుంటే ఇప్పుడు సైలెంట్ గా నీ కూతురిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యావా ? అంటూ నిలదీశాడు. పెళ్లి చేసుకునే యువతి వేరే అబ్బాయితో తీసుకున్న ఫోటోలు అమ్మాయి తండ్రి ముఖం మీద కొట్టాడు. అక్కడ రచ్చరచ్చ అయ్యింది. ఈ గొడవతో పెళ్లికూతురి తల్లి ప్రాణం పోయింది.

19 ఏళ్ల కూతురు
బెంగళూరు సిటీలోని డీజే హళ్లిలోని మోదీ మసీదు రోడ్డులో మునావర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 22 సంవత్సరాల క్రితం మునావర్ షాహిదా బేగం అలియాస్ షాహిదా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మునావర్, షాహిదా దంపతులు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. మునావర్, షాహిదా దంపతులకు 19 ఏళ్ల కుమార్తె ఉంది.

నిశ్చితార్థం జరిగింది
కూతురికి పెళ్లి చెయ్యాలని మునావర్, షాహిదా దంపతులు డిసైడ్ అయ్యారు. బంధువులు ఓ పెళ్లి సంబంధం సెట్ చేశారు. పెళ్లి చేసుకోవడానికి షాహిదా కూతురు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో యువతి, యువకుడి నిశ్చితార్థం ఇటీవల బెంగళూరులోనే జరిగిపోయింది.

నా కొడుకు ఏమైనా సెకండ్ హ్యాండా?
పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్న ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు. పెళ్లి కొడుకు తండ్రి ఓ ఫోటో తీసుకుని పెళ్లి కూతురి తండ్రి మునావర్ దగ్గరకు వెళ్లాడు. ఏందిరా నువ్వు చేస్తున్న పని, నీ కూతురు ఎవరితోనో తిరిగి ఎంజాయ్ చేసి ఫోటోలు, వీడియోలు తీసుకుంటే ఇప్పుడు సైలెంట్ గా నీ కూతురిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యావా ?, నా కొడుకు ఏమైనా సెకండ్ హ్యాండ్ అనుకుంటున్నావా అంటూ నిలదీశాడు.

ఇంట్లో ఢిష్యూం ఢిష్యూం
పెళ్లి చేసుకునే యువతి వేరే అబ్బాయితో తీసుకున్న ఫోటోలు అమ్మాయి తండ్రి మునావర్ ముఖం మీద కొట్టాడు. అక్కడ రచ్చరచ్చ అయ్యింది. ఆ సందర్బంలో ఇరువర్గాల మద్య తోపులాట జరిగింది. ఆ సందర్బంలో షాహిదా మీద దాడి చెయ్యడంతో ఆమె కిందపడిపోయింది.

దెబ్బతో పెళ్లికూతురి తల్లి ప్రాణం పోయింది
డోర్ పక్కన ఉన్న పదునైన గునపం షాహిదా కడుపులోకి గుచ్చుకుంది. తీవ్రగాయాలైన షాహిదాను ఆసుపత్రికి తరలించారు. అయితే షాహిదా ప్రాణం పోయిందని డీజే హళ్లి పోలీసులు అన్నారు. పెళ్లికూతురు బాయ్ ఫ్రెండ్ తో తీసుకున్న ఫోటో దెబ్బతో ఆమె తల్లి ప్రాణం పోవడం బెంగళూరులో కలకలం రేపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications