బెంగళూరులో వర్ష బీభత్సం: వరదలో చిక్కుకుని ఏపీ లేడీ టెక్కీ మృతి, సీఎం పరిహారం

బెంగళూరు: కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం నగర వాసుల్ని బెంబేలెత్తించింది. భారీ వర్షంతో నగర రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

వాహనాలు రహదారులపైనే గంటలకొద్ది నిలిచిపోయాయి. పాదచారులు కూడా వరదలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, కేఆర్ సర్కిల్ అండర్‌పాస్‌లో కారు చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భానురేఖ మృతి చెందారు. బెంగళూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి కేసీఆర్ సర్కిల్ వద్ద అండర్ పాస్‌లోకి భారీగా వరదనీరు చేరింది. వరదనీటిలో ఓ కారు చిక్కుకుపోయింది. ఈ కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్నారు.

 Heavy rain lashes Bengaluru city: Andhra Pradesh techie died in floods.

గమనించిన స్థానికులు వెంటనే వారిని బయటికి తీశారు. వీరిలో భానురేఖ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కారులోని మిగితా కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారు. విహార యాత్ర కోసం వీరు ఏపీ నుంచి ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.

బెంగళూరు నగరాన్ని అకాల వర్షం ముంచెత్తడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయ కార్యక్రమాలను హుటాహుటిన చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు, భానురేఖ చికిత్స పొందిన ఆస్పత్రిని సిద్దరామయ్య సందర్శించారు. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు.

కుమారకృప రోడ్డు మార్గంలో చెట్టు విరిగిపడటంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. చిత్రకళా పరిషత్ ఎదుట ఓ చెట్టు కుప్పకూలడంతో ఓ కారు, బైక్ ధ్వంసమయ్యాయి. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో పలు ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. కాగా, బెంగళూరులోని పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+