Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: భర్తతో కాపురం బోరు కొట్టిందని పార్ట్ టైమ్ ప్రియుడు, వార్నింగ్ ఇచ్చిన భర్త వాష్ ఔట్ !

బెంగళూరు/ చెన్నై: ఐటీ హబ్ లో బయటకు వెళితే ట్రాఫిక్ సమస్యలతో ఎప్పుడు ఇంటికి చేరుకుంటారో చెప్పడం చాలా కష్టం. ఇలాంటి బెంగళూరులో నేరాల సంఖ్య తక్కువ ఏమీలేదు. సంతోషంగా కాపురం చేసుకుంటున్న దంపతుల మద్య ఓ పరాయి వ్యక్తి చిచ్చు పెట్టాడు. భర్తతో ఎంతసేపు కాపురం చేస్తావు ?, నువ్వు టేస్ట్ మార్చి చూడూ అంటూ భార్యను రెచ్చగొట్టాడు. ఇదేదో బాగుందనుకున్న భార్య ఆమె భర్త అతని పనిలో అతను బిజీగా బయట ఉండటంతో అతని భార్య ఆమె ప్రియుడితో రొమాన్స్ మొదలు పెట్టింది. ఉదయం బయటకు వెలుతున్న భర్త రాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగివస్తుండటంతో భార్యకు బయట తిరగడానికి లక్కీ చాన్స్ చిక్కింది. ప్రియుడి మైకంలో పీకలలోతు కూరుకుపోయిన భార్య మస్త్ మజా చేసింది. రానురాను ప్రియుడిని ఇంటికే పిలిపించుకుంటున్న భార్య విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. నువ్వు లేని సమయంలో నీ ఇంటికి ఎవడో గొట్టంగాడు వచ్చి నీ భార్యతో కులుకుతున్నాడని, నువ్వు చూస్తే బయట తిరిగి తగలడుతున్నావని చుట్టుపక్కల వాళ్లు భర్తకు చివాట్లు పెట్టారు. భార్య అక్రమ సంబంధం విషయంలో ఆరు నెలల నుంచి గొడవ జరుగుతోంది, చివరికి ప్రియుడు, అతని సోదరుడు వెళ్లి పనిలో నిమగ్నం అయ్యి ఫుల్ బిజీగా ఉన్న భర్తను దారుణంగా స్పాట్ లో నరికి చంపేయడం కలకలం రేపింది. భర్త హత్యకు అతని భార్య కూడా స్కెచ్ వేసిందని వెలుగు చూడటంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు.

సొంత గ్యారేజ్ లో డబ్బులే డబ్బులు

సొంత గ్యారేజ్ లో డబ్బులే డబ్బులు

ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని విజయనగర రైల్వే ప్యార్లల్ రోడ్డులో సాదిల్ పాషాఅనే యువకుడు సొంతంగా గ్యారేజ్ నిర్వహిస్తున్నాడు. గ్యారేజ్ లో పని వాళ్లను పెట్టుకుని పని చేయిస్తున్న సాదిల్ ప్రతిరోజు వేల రూపాయల డబ్బులు సంపాధిస్తున్నాడు. విజయనగర సమీపంలోనే సాదిల్ అతని భార్య అత్తరున్నీసా (పేరు మార్చడం జరిగింది) తో కలిసి కాపురం ఉంటున్నాడు.

భర్తతో ఎంతకాలం కాపురం చేస్తావు.... ఈ వయసులోనే ఎంజాయ్ చెయ్యాలి

భర్తతో ఎంతకాలం కాపురం చేస్తావు.... ఈ వయసులోనే ఎంజాయ్ చెయ్యాలి

సంతోషంగా కాపురం చేసుకుంటున్న సాదిల్, అత్తరున్నీసా దంపతుల మద్య అర్బజ్ ఖాన్ అనే వ్యక్తి చిచ్చు పెట్టాడు. సాదిల్ దూరపు బంధువు అయినా అర్బజ్ అతని భార్య అత్తరున్నీసా మీద కన్ను వేశాడు. నీ భర్త సాదిల్ తో ఎంతకాలం కాపురం చేస్తావు ?, నువ్వు టేస్ట్ మార్చి చూడూ, రుచి భలే ఉంటుంది, నేను అయితే రెఢీగా ఉన్నాను అంటూ భార్య అత్తరున్నీసాను రెచ్చగొట్టాడు. ఇదేదో బాగుందనుకున్న అత్తరున్నీసా ఆమె భర్త సాదిల్ అతని పనిలో అతను బిజీగా బయట ఉండటంతో ఆమె అర్బజన్ తో రొమాన్స్ మొదలు పెట్టింది.

రెచ్చిపోయిన భార్య..... ఎంజాయ్ చేసిన ప్రియుడు

రెచ్చిపోయిన భార్య..... ఎంజాయ్ చేసిన ప్రియుడు

ఉదయం బయటకు వెలుతున్న భర్త సాదిల్ గ్యారేజ్ లో పని ముగించుకుని రాత్రి ఎప్పుడో ఇంటికి తిరివెలుతున్నాడు. ఈ మద్యలో సాదిల్ భార్య అత్తరున్నీసా ఆమె ప్రియుడు అర్బజ్ తో బయట తిరగడానికి లక్కీ చాన్స్ చిక్కింది. ప్రియుడు అర్బజ్ మైకంలో పీకలలోతు కూరుకుపోయిన భార్య అత్తరున్నీసా మస్త్ మజా చేసింది. రానురాను ప్రియుడు అర్బజ్ ను ఇంటికే పిలిపించుకుంటున్న అత్తరున్నీసా అతనితో విచ్చలవిడిగా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది.

 భార్య, ప్రియుడికి వార్నింగ్

భార్య, ప్రియుడికి వార్నింగ్

నువ్వు లేని సమయంలో నీ ఇంటికి ఎవడో గొట్టంగాడు వచ్చి నీ భార్య అత్తరున్నీసాతో కులుకుతున్నాడని, నువ్వు చూస్తే బయట తిరిగి తగలడుతున్నావని చుట్టుపక్కల వాళ్లు సాదిల్ కు చివాట్లు పెట్టారు. భార్య అత్తరున్నీసా అక్రమ సంబంధం విషయంలో ఆరు నెలల నుంచి సాదిల్ ఇంట్లో గొడగ చేస్తున్నాడు.

భార్యకు షాక్ ఇచ్చిన భర్త

భార్యకు షాక్ ఇచ్చిన భర్త

భార్య అత్తరున్నీసాతో పాటు ఆమె ప్రియుడు అర్బజన్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. భార్య అత్తరున్నీసా ఇంటి నుంచి బయటకు కదలకుండా చేసిన సాదిల్ ఆమె ప్రియుడు అర్బజ్ ను దూరం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఇదే విషయంలో సాదిల్, అర్బజ్ మద్య గొడవలు జరుగుతున్నాయి. నా ఇంటి వైపు వస్తే నిన్ను చంపేస్తానని భర్త సాదిల్ అతని భార్య ప్రియుడు అర్బజ్ కు పదేపదే ఫోన్లు చేసి వార్నింగ్ ఇచ్చాడు.

భర్తను స్పాట్ లో చంపేసిన ప్రియుడు

భర్తను స్పాట్ లో చంపేసిన ప్రియుడు

ఈనెల 17వ తేదీన విజయనగర రైల్వే ప్యార్లల్ రోడ్డులోని సొంత గ్యారేజ్ లో సాదిల్ బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో అర్బజ్ అతని సోదరుడు (మైనర్) గ్యారేజ్ దగ్గరకు వెళ్లాడు. వీడు ఎందుకు వచ్చాడు అని సాదిల్ ఆలోచిస్తున్న సమయంలో అర్బజ్, అతని సోదరుడు కత్తులతో దాడి చేసి అతన్ని స్పాట్ లో చంపేసి అక్కడి నుంచి పరారైనారు. నిమిషాల్లో సాదిల్ ను నరికి చంపేయడంతో గ్యారేజ్ చుట్టు పక్కల ఉన్న వాళ్లు భయంతో హడలిపోయారు.

భర్త హత్యకు భార్య స్కెచ్ వేసిందా ?

భర్త హత్యకు భార్య స్కెచ్ వేసిందా ?

భర్త సాదిల్ హత్యకు అతని భార్య అత్తరున్నీసా కూడా స్కెచ్ వేసిందని వెలుగు చూడటంతో పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. సాదిల్ హత్య కేసులో అతని భార్య ప్రియుడు అర్బజ్, అతని మైనర్ సోదరుడిని శుక్రవారం విజయనగర పోలీసులు అరెస్టు చేశారు. సాదిల్ హత్యకు కిరాయి హతంకులు ఎవరైనా సహకరించారా ? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సాదిల్ భార్యను ఇంకా అరెస్టు చెయ్యలేదని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద భార్య అక్రమ సంబంధం కారణంగా ప్రియడు అర్బజ్ చేతిలో సాదిల్ హత్యకు గురివాడంతో అతని కుటుంబ సభ్యులు రగిలిపోతున్నారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+