Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: యోగా క్లాసులకు వెళ్లి ప్రియుడితో భార్య ?, మ్యాటర్ లీక్, భర్త హత్యకు డీల్!

బెంగళూరు/ హాసన్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో చక్కగా కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. తన భార్య, పిల్లలతో జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని భర్త ఆశపడ్డాడు. తన అందం కాపాడుకోవడానికి నేను యోగా శిక్షణకు వెలుతానని భార్య ఆమె భర్తకు చెప్పింది. భార్య అందంగా ఉంటే తనకు కూడా సంతోషంగా ఉంటుందని అనుకున్న భర్త అతని భార్యను యోగా క్లాసులకు పంపించాడు. యోగా నేర్చుకుంటున్న భార్య యోగాతో పాటు ప్రియుడితో వెరైటీ రొమాన్స్ పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది. యోగా క్లాసుల ముసుగులో భార్య ఆమె ప్రియుడితో ప్రత్యేకంగా స్పెషల్ క్లాసులకు హాజరై ఎంజాయ్ చేసింది.

భార్య అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. అక్కడ నుంచి కథ అనేక మలుపులు తిరిగింది. ఇక లాభం లేదని అనుకున్న భార్య ఆమె ముద్దుల ప్రియుడికి సుపారి ఇచ్చి కట్టుకున్న భర్తను హత్య చెయ్యడానికి స్కెచ్ వేసింది. స్కూల్ నుంచి పిల్లలను పిలుచుకుని రావడానికి వెళ్లిన భర్త అలాగే పైలోకాలకు వెళ్లిపోయాడు. ఇప్పటికే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చిన కిలాడీ పెళ్లామ్ ఇప్పుడు మరోసారి భర్త హత్య కేసులో కటకటాలపాలైయ్యింది.

భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న భర్త

భార్యను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న భర్త

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని చెన్నరాయణపట్టణలోని కావలు హోసూరులో ఆనంద్ (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన సునీత అనే యువతిని ఆనంద్ వివాహం చేసుకున్నాడు. సునీతను వివాహం చేసుకున్న ఆనంద్ అతని భార్యతో చక్కగా కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఆనంద్ అతని భార్య సునీతను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు.

అందం కాపాడుకోవాలని యోగాకు వెళ్లింది

అందం కాపాడుకోవాలని యోగాకు వెళ్లింది

తన భార్య సునీతతో పాటు ఇద్దరు పిల్లలతో జీవితాంతం సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆనంద్ ఆశపడ్డాడు. తన అందం కాపాడుకోవడానికి నేను యోగా శిక్షణకు వెలుతానని సునీత ఆమె భర్త ఆనంద్ కు చెప్పింది. నా భార్య సునీత అందంగా ఉంటే తనకు కూడా సంతోషంగా ఉంటుందని అనుకున్న ఆనంద్ అతని భార్యను యోగా క్లాసులకు పంపించాడు.

యోగాతో పాటు ప్రియుడితో స్పెషల్ క్లాసులు

యోగాతో పాటు ప్రియుడితో స్పెషల్ క్లాసులు

యోగా నేర్చుకుంటున్న ఆనంద్ భార్య సునీత బాబు అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. రోజు గంట సేపు యోగా క్లాసు ఉంటే రెండు మూడు గంటలు బాబుతో గడుపుతున్న సునీత అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. సునీత యోగాతో పాటు ప్రియుడు బాబుతో వెరైటీ రొమాన్స్ పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది.

భార్యను ఫాలో అయ్యి షాక్ అయిన భర్త

భార్యను ఫాలో అయ్యి షాక్ అయిన భర్త

యోగా క్లాసుల ముసుగులో ఆనంద్ భార్య సునీత ఆమె ప్రియుడు బాబుతో ప్రత్యేకంగా స్పెషల్ క్లాసులకు హాజరై ఎంజాయ్ చేసింది. రోజు గంటలు గంటలు బయటకు వెలుతున్న భార్య సునీత తీరు మీద అనుమానం రావడంతో ఆమెకు తెలీకుండా ఆనంద్ ఫాలో కావడంతో అతని భార్య అసలు మ్యాటర్ బయటపడింది.

 భర్తను చంపేయాలని ప్రియుడికి కిరాయి ఇచ్చిన భార్య

భర్తను చంపేయాలని ప్రియుడికి కిరాయి ఇచ్చిన భార్య

నువ్వు పద్దతి మార్చుకోకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆనంద్ అతని భార్య సునీతకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఆనంద్, సునీత దంపతుల మద్య ఇదే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇక లాభం లేదని అనుకున్న సునీత ఆమె ముద్దుల ప్రియుడు బాబుకు సుపారి ఇచ్చి కట్టుకున్న భర్త ఆనంద్ ను హత్య చెయ్యడానికి స్కెచ్ వేసింది.

పిల్లల కోసం వెళ్లి పైలోకాలకు వెళ్లిపోయిన భర్త

పిల్లల కోసం వెళ్లి పైలోకాలకు వెళ్లిపోయిన భర్త

జనవరి 31వ తేదీన స్కూల్ కు వెళ్లిన పిల్లలను పిలుచుకుని రావడానికి ఆనంద్ బైక్ లో వెళ్లాడు. పిల్లల కోసం వెళ్లిన ఆనంద్ ను నుగ్గేన హళ్లి సమీపంలో సునీత ప్రియుడు బాబు అడ్డగించి అక్కడే అతన్ని దారుణంగా హత్య చేశాడు. తన భర్త ఆనంద్ ను ఎవరో హత్య చేశారని అప్పట్లో సునీత నాటకాలు వేసింది.

గతంలో హత్య కేసు....... ఇప్పుడు ప్రియుడి మోజులో మరోసారి జైలుకు

గతంలో హత్య కేసు....... ఇప్పుడు ప్రియుడి మోజులో మరోసారి జైలుకు

భర్త ఆనంద్ చనిపోయాడని ఏమాత్రం బాధలేకుండా సునీత ప్రియుడితో ఎంజాయ్ చేసింది. పోలీసులకు అనుమానం వచ్చి సునీతను అదుపులోకి తీసుకుని బెండ్ తీస్తే మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది. సునీత, ఆమె ప్రియుడు బాబును పోలీసులు అరెస్టు చేశారు. 2014లో డైవర్ నేర్చుకోవడానికి వెళ్లిన సమయంలో మహిళ హత్య కేసులో సునీత జైలుకు వెళ్లింది. బెయిల్ మీద బయటకు వచ్చిన సునీత భర్త ఆనంద్ తో కలిసి కాపురం చేస్తోంది. ఇప్పుడు ప్రియుడి మోజులో పడిన సునీత ఇప్పుడు మరోసారి భర్త ఆనంద్ హత్య కేసులో ప్రియుడితో కలిసి కటకటాలపాలైయ్యింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+