మా లెక్కలు మావే. ఏ పార్టీకి అయినా సరే మద్దతు ఇస్తాము, రూట్ మార్చిన గాలి జనార్దన్ రెడ్డి !

బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రణరంగానికి రోజులు దగ్గర పడుతున్నాయి. కర్ణాటకలో ఇంతకాలం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టలీల మధ్యే పోటీ ఉండేది. కర్ణాటకలో ఈ మూడు పార్టీల మధ్య ఇంతకాలం పోటీ జరిగేది. అయితే ఇప్పుడు కర్ణాకట మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి (కేఆర్ పీ) పార్టీ తెర మీదకు వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే తాను ఎవరికి మద్దతు ఇస్తాను ? అనే విషయంలో గాలి జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

కర్ణాటకలో ఇప్పుడు కొన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లోలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్, కేఆర్ పీ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంది. కొంతకాలం క్రితం తాను అవసరం అయితే బీజేపీకి మద్దతు ఇచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి సహకరిస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. అయితే ఇప్పుడు మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి రూట్ మార్చారు.

gali janardhan reddy

కల్యాణ రాజ్య ప్రగతి (కేఆర్ పీ) పార్టీ సిద్దాంతాలను ఎవరు గౌరవిస్తారో, మా మేనిఫేస్టోలోని హామీలను ఎవరు నేరవేర్చడానికి సిద్దం అవుతారో వారికి మా మద్దతు ప్రకటిస్తామని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మా పార్టీ ఇచ్చిన హామీలు నేరవేర్చడానికి సహకరించే వారు ఎవరైనా సరే, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, జేడీఎస్ అయినా సరే మా పార్టీ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

కర్ణాటకలో మా పార్టీ మద్దతు లేకుండా ఎవ్వరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేరని గాలి జనార్దన్ రెడ్డి ధీమాగా చెప్పారు. కర్ణాటకలో కేఆర్ పీకి చెందిన 25 మందికి పైగా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడుతారని, అందులో ఎలాంటి డౌట్ లేదని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం బెగళవావి జిల్లాలోని అపలు శాసన సభ నియోజక వర్గాల్లో పర్యటించిన గాలి జనార్దన్ రెడ్డి పలువురు నాయకులతో చర్చించారు.

బెళావి జిల్లాలోని బెళగావి గ్రామీణ, బెళగావి ఉత్తర, కుడచి, అథణి, ఖానాపుర, రాయభాగ తదితర నియోజక వర్గాల్లో కేఆర్ పీ అభ్యర్థులతో గాలి జనార్దన్ రెడ్డి చర్చించారు. బెళగావి జిల్లాలో కేఆర్ పీ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉత్తర కర్ణాటకతో పాటు కరావళి ప్రాంతాల్లో కూడా గాలి జనార్దన్ రెడ్డి పార్టీ మీద పోటీ చెయ్యడానికి పలువురు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. మా పార్టీ లేకుండా కర్ణాటకలో ఏ పార్టీ కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదని గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+