Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటక కింగ్ ఎవరో తేలేది నేడే.. అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ; బెంగళూరులో 144 సెక్షన్!!

ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి కర్ణాటక ఎన్నికల ఫలితాలపై కేంద్రీకృతమైంది. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. గెలుపుపై ఎవరికివారు ధీమాగా ఉన్నా లోపల మాత్రం అన్ని పార్టీల్లోనూ భయం కనిపిస్తుంది. స్పష్టమైన మెజారిటీ రాకపోతే, హంగ్ వస్తే పరిస్థితి ఏమిటి అన్న ఆందోళన ప్రతి ఒక్కరి లోనూ కనిపిస్తుంది.

కర్ణాటక ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొత్తం 36 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 224 స్థానాలకు గాను 2615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి రికార్డు స్థాయిలో 73. 19 శాతం ఓటింగ్ నమోదు కాగా, అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది.

Karnataka election 2023 results

ఈ రోజు మధ్యాహ్నం నాటికి స్పష్టమైన ఫలితం వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 140కి పైగా స్థానాలతో విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ 2018 సాధించిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని స్పష్టంగా సూచించింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా హంగ్ అసెంబ్లీ ని అంచనా వేయగా కింగ్ మేకర్ గా జెడిఎస్ మారుతుందని చర్చ జరుగుతుంది.

అయితే హంగ్ అసెంబ్లీ అంచనా వేస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టాయి. స్వతంత్ర అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై ఫోకస్ చేసి వాళ్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదిఏమైనా ఉత్కంఠభరితంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు.

ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే, హంగ్ వస్తే జెడిఎస్ ఎవరికి మద్దతు ఎవరికి ఇస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో జెడిఎస్ మద్దతు ఎవరి వైపు ఉంటుంది అన్నది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం బెంగళూరులో 144 సెక్షన్ విధించారు.

ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. బెంగళూరు కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని, పోలీసు ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+