Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karnataka Ratna: అవార్డుకు కల వచ్చింది, దేవుడిబిడ్డ అంటే పునీత్ రాజ్ కుమార్: రజనీకాంత్, ఎన్టీఆర్!

బెంగళూరు/హైదరాబాద్: ఎన్టీఆర్, ఎంజీఆర్, డాక్టర్ రాజ్ కుమార్ సినిమాల్లో పేదలకు దానాలు, ధర్మాలు చేసే వ్యక్తుల గురించి మనకు చూపించారు, ఆ సన్నివేశాలు మనం చూశాము, అయితే నిజజీవితంలో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మనం పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ రూపంలో చూశామని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. చిరునవ్వుతో ఎదుటి వారిని పలకరించడం, ఎంతో ఎత్తుకు ఎదిగినా సామాన్యుడిలా, అందరి ఇంటిలో ఓ బిడ్డగా, మన ఇంటిలో ఒకడిగా మిగిలిపోయిన పునీత్ రాజ్ కుమార్ కు నిజమైన గౌరవం కర్ణాటక రత్న అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు.

కర్ణాటక రత్న అవార్డుకు నిలువెత్తు రూపం పునీత్ రాజ్ కుమార్ అని యంగ్ టైగర్ ఎన్డీఆర్ అన్నారు. మంగళవారం బెంగళూరులోని విధాన సౌధలో పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ప్రకటించి ఆ అవార్డును ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్ కు అందించారు.

పవర్ స్టార్ ‘అప్పు'కు కర్ణాటక రత్న అవార్డు

పవర్ స్టార్ ‘అప్పు'కు కర్ణాటక రత్న అవార్డు

స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది ఆయన కోట్లాది మంది అభిమానులు అందరిని వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కన్నడ రాజ్యోత్సవం సందర్బంగా మంగళవారం బెంగళూరులోని విధాన సౌధలో ఘనంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ప్రకటించి ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్ కుమార్ కు అందించారు.

కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వం

ఇన్ని సంవత్సరాలు పలు రంగాలలో ప్రజాసేవ చేసిన ఎంతో మంది ప్రముఖులకు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న అవార్డులు అందించింది. ఇప్పటి వరకు కర్ణాటక కవి కువెంపు, డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ శివకుమార్ స్వామీజీ, వీరేంద్ర హెగ్డే తదితరులు ఈ కర్ణాటక రత్న అవార్డు అందుకున్నారు. అతి తక్కువ వయసులో కర్ణాటక రత్న అవార్డు అందుకున్న వ్యక్తిగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నిలిచిపోయారు.

దేవుడి బిడ్డకు అర్థం పునీత్ రాజ్ కుమార్

దేవుడి బిడ్డకు అర్థం పునీత్ రాజ్ కుమార్

దేవుడి పుట్టించిన వ్యక్తులు చేసే సేవు చూసి వారిని దేవుడి బిడ్డల్లా చూస్తారని, ప్రపంచంలో కొంత మంది మాత్రమే ఉంటారు. అలాంటి వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ అని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. అలాంటి వ్యక్తిత్వాన్ని పునీత్ రాజ్ కుమార్ అతి తక్కువ వయసులోనే సొంతం చేసుకున్నారని, నటుడిగానే కాకుండా సమాజసేవకుడిగా అప్పు కోట్లాది మంది కన్నడిగుల గుండెల్లో నిలిచిపోయారని, అలాంటి వ్యక్తి ఇంత చిన్న వయసులో దూరం కావడం చాలా బాదగా ఉందని రజనీకాంత్ అన్నారు.

శబరిమలలో అప్పును చూశాను, రజనీకాంత్

శబరిమలలో అప్పును చూశాను, రజనీకాంత్

1979లో రాజ్ కుమార్ నాలుగు సంవత్సరాల పునీత్ రాజ్ కుమార్ ను ఎత్తుకుని శబరిమలకు వచ్చారని 48 కిలోమీటర్లు పునీత్ రాజ్ కుమార్ ను ఎత్తుకుని శబరిమలకు నడుచుకుంటూ రాజ్ కుమార్ వచ్చారని, ఆ రోజు నేను అప్పును మొదటిసారి చూశానని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. తరువాత అప్పు 100 రోజుల వేడుకకు రాజ్ కుమార్ కోరిక మేరకు నేను హాజరై అప్పును ఆశీర్వదించారని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.

చిరునవ్వు పునీత్ సొంతం

చిరునవ్వు పునీత్ సొంతం

చిరునవ్వుతో ఎదుటి వారిని పలకరించడం, ఎంతో ఎత్తుకు ఎదిగినా సామాన్యుడిలా, అందరి ఇంటిలో ఓ బిడ్డగా, మన ఇంటిలో ఒకడిగా మిగిలిపోయిన పునీత్ రాజ్ కుమార్ కు నిజమైన గౌరవం కర్ణాటక రత్న అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. కర్ణాటక రత్న అవార్డుకు నిలువెత్తు రూపం పునీత్ రాజ్ కుమార్ అని యంగ్ టైగర్ ఎన్డీఆర్ అన్నారు.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్

పునీత్ రాజ్ కుమార్ తనకు సొంత సోదరుడికంటే ఎక్కువ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. పునీత్ రాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్ అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. విధాన సౌదలో జరిగిన పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు అందించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడలోనే మాట్లాడుతూ కన్నడిగులకు కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడలో మాట్లాడి అక్కడ ఉన్న వారిని ఆకట్టుకున్నారు.

పునీత్ రాజ్ కుమార్ నేటి యువతకు ఆదర్శం, సీఎం

పునీత్ రాజ్ కుమార్ నేటి యువతకు ఆదర్శం, సీఎం

పునీత్ రాజ్ కుమార్ నేటి యువతకు ఆదర్శం, ఆయన చేసిన సమాజసేవ అలాంటిది అని, నటుడిగానే కాకుండా మంచి మనసు ఉన్న వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్ చరిత్రలో మిగిలిపోయారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు. విధాన సౌధలో పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు అందించే కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, కర్ణాటక మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+