Lady officer: భార్య కేఏఎస్ ఆఫీసర్, భర్త పవర్ ఫుల్ బాడీబిల్డర్, భార్య క్యాంపుకు వెళితే ఇంట్లో జిమ్మర్?
బాడీబిల్డర్ కు కేఏఎస్ అధికారినిగా ఉద్యోగం చేస్తున్న చాలా అందమైన భార్య ఉంది. కానీ జీవితంలో ఏం మిస్ అయ్యిందో ఏమో ఆ బాడీబిల్డర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించాడు.
బెంగళూరు/బెళగావి: అతను ఫస్ట్ గ్రేడ్ హోదా ఉన్న ఉద్యోగి. చిన్నప్పటి నుంచి జిమ్‌కి వెళ్లి బాడీబిల్డర్ అయ్యాడు. పదిమందిని ఒంటి చేతితో కొట్టే సినిమా హీరోలా కనిపిస్తుంటాడు. ఇది కాకుండా అతని భార్య కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిని. కేఏఎస్ అధికారి అంటే కర్ణాటకలో చాలా ఉన్నతమైన హోదా ఉన్న ఉద్యోగం.
భారతదేశంలో ఐఏఎస్ ఉద్యోగాల కోసం ఎంత పోటీ ఉంటుందో అలాగే కర్ణాటకలో కేఏఎస్ పరీక్షలకు అంతే పోటీ ఉంటుంది. బాడీబిల్డర్ కు కేఏఎస్ అధికారినిగా ఉద్యోగం చేస్తున్న చాలా అందమైన భార్య కూడా ఉంది. కానీ జీవితంలో ఏం మిస్ అయ్యిందో ఏమో తెలియదు కాని ఆ బాడీబిల్డర్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది.

మేడమ్ కేఏఎస్ అధికారి
కర్ణాటకలోని బెళగావిలోని హిడకల్ డ్యామ్ భూస్వాధీన అధికారిగా కేఏఎస్ ఆఫీసర్ రే్మా తాళికోటే అలియాస్ రేష్మా ఉద్యోగం చేస్తున్నారు. కేఏఎస్ అధికారి అంటే ఐఏఎస్ అధికారి కంటే కొంచెం చిన్నస్థాయి హోదా. కేఏఎస్ అధికారి అంటే దాదాపుగా ఐఏఎస్ అధికారి హోదా ఉంటుంది. కేఏఎస్ అధికారి రేషా చాలా సంవత్సరాల క్రితం జాఫర్ ఫిర్దోజ్ (39) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

సినిమా హీరోలాగా ఉంటాడు.... ప్రభుత్వ ఉద్యోగం
జాఫర్ ఫిర్దోజ్ కర్ణాటక ప్రభుత్వంలోని రెవెన్యూ శాఖలో ఎఫ్ డీఏ అధికారి (ఫస్ట్ గ్రేడ్ ఉద్యోగం)గా ఉద్యోగం చేస్తున్నాడు. జాఫర్ ఫస్ట్ గ్రేడ్ హోదా ఉన్న ఉద్యోగి. జాఫర్ చిన్నప్పటి నుంచి జిమ్‌కి వెళ్లి బాడీబిల్డర్ అయ్యాడు. జాఫర్ పదిమందిని ఒంటి చేతితో కొట్టే సినిమా హీరోలా కనిపిస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న జాఫర్ కు గెజిటెడ్ హోదా ఉన్న భార్య రేష్మా కూడా ఉండటంతో ఇద్దరూ చాలా సంతోషంగా జీవినం సాగిస్తున్నారని అందరూ అనుకున్నారు.

భార్య బెంగళూరుకు..... ఇంట్లో శవం అయ్యాడు
కేఏఎస్ అధికారి అయిన రేష్మా గెజిటిడ్ ఆఫీసర్ ర్యాంక్ లో ఉన్నారు. బెంగళూరులో ఉద్యోగరీత్యా పని ఉండటంతో రేష్మా కారులో బెంగళూరు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న జాఫర్ ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. తరువాత బాడీబిల్డర్, ప్రభుత్వ ఉద్యోగి జాఫర్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఇంటికి వెళ్లిన బంధువులు విషయం గుర్తించి పోలీసు అధికారులకు సమచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

మేడమ్ భర్తకు ఏం అయ్యింది?
భార్య రేష్మా కేఏఎస్ అధికారిగా ఉద్యోగం చేస్తుంటే ప్రభుత్వంలో స్థానికంగా ఆమె భర్త జాఫర్ కు మంచి పేరు ఉంది. జాఫర్ కూడా ప్రభుత్వం ఉద్యోగం చెయ్యడం, చూడటానికి సినిమా హీరోలా ఉండటంతో అతనికి ఎలాంటి సమస్యలు లేవని తెలిసింది. అయితే ఇలాంటి స్థితిలో జాఫర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న కేఏఎస్ అధికారి రేష్మా బెంగళూరు నుంచి బెళగావికి పరుగు తీశారు. కేఏఎస్ అధికారి రేష్మాను విచారణ చేసిన తరువాత అసలు మ్యాటర్ తెలుస్తోందని, ఇప్పటి వరకు జాఫర్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని బెళగావిలోని ఏఎంసీ మార్కెట్ పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications