బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi: భార్య రెచ్చగొట్టింది, ప్రియురాలితో ఎంజాయ్ చేసిన భర్త, లవ్ జీహాద్ కు యువతి బలి, కేటుగాడు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ఉడిపి: చదువుకుంటున్న అమ్మాయికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం ఆ అమ్మాయితో స్నేహంగా ఉన్న ఆ యువకుడు తరువాత ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గర అయ్యాడు. రానురాను ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు ఆమెతో ఎంజాయ్ చేశాడు. అమ్మాయి హిందువు కావడం, ప్రియుడు ముస్లీం కావడంతో కొంతకాలం పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఇదే మంచి అవకాశం అని అనుకున్న ప్రియుడు ఐదు సంవత్సరాలు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న ప్రియుడికి ముందే పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు..

తన భర్తకు ప్రియురాలు ఉందని తెలిసినా భార్య ఏమాత్రం పట్టించుకోలేదని, ఇంకా భర్తను రెచ్చగొట్టి ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యాలని చెప్పిందని ఆరోపణలు ఉన్నాయి. చివరికి పెళ్లి విషయానికి వచ్చిన తరువాత నువ్వు ఇస్లాం మతం స్వీకరించాలని, నేను చెప్పినట్లు జీవితాంతం ఉండాలని ప్రియుడు టార్చర్ పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.

నా ప్రియుడు నన్ను ప్రేమించలేదని, శారీరకంగా వాడుకుని వదిలేశాడని తెలుసుకున్న ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బలవంతంగా మతం మార్చాలని ప్రియుడు ప్రయత్నించాడని, పెళ్లి పేరుతో ఆమెను మోసం చేశాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని యువతి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.

Wife: రెండో భార్య గర్బవతి, భర్తకు డౌట్, భార్య, కొడుకు హత్య, ఆంటీ జస్ట్ మిస్, 8 ఏళ్లు అజ్ఞాతంలో!Wife: రెండో భార్య గర్బవతి, భర్తకు డౌట్, భార్య, కొడుకు హత్య, ఆంటీ జస్ట్ మిస్, 8 ఏళ్లు అజ్ఞాతంలో!

10వ తరగతిలోనే అమ్మాయికి వల వేసిన కేటుగాడు

10వ తరగతిలోనే అమ్మాయికి వల వేసిన కేటుగాడు

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కుందాపుర తాలుకాలోని తల్లూరులో శిల్పా అనే యువతి నివాసం ఉంటున్నది. శిల్పా 10వ తరగతి చదుతున్న సమయంలో ట్యాషన్ కు వెళ్లేది. ఆ సందర్బంలో శిల్పాకు అజీజ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం శిల్పాతో మాట్లాడుతున్న అజీజ్ ఆమెతో స్నేహం పెంచుకున్నాడు.

ప్రియురాలితో ఎంజాయ్

ప్రియురాలితో ఎంజాయ్

అజీజ్ శ్రీమంతుడు కావడం, శిల్పా పేదరికంలో ఉండటంతో కేటుగాడికి ఆ విషయం కలిసొచ్చింది. కొంతకాలం శిల్పాతో స్నేహంగా ఉన్న అజీజ్ తరువాత ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెకు దగ్గర అయ్యాడు. రానురాను శిల్పాను సినిమాలకు, శికార్లకు తిప్పడం మొదలుపెట్టాడు. చివరికి శిల్పాతో శారీరక సంబంధం పెట్టుకున్న అజీజ్ ఆమెను విహారయాత్రలకు తిప్పిన అజీజ్ ఆమెతో ఎంజాయ్ చేశాడు.

ప్రియుడికి ముందే పెళ్లి అయ్యింది... ఇద్దరు పిల్లలు

ప్రియుడికి ముందే పెళ్లి అయ్యింది... ఇద్దరు పిల్లలు

ప్రియురాలు శిల్పాతో ఎంజాయ్ చేస్తున్న అజీజ్ కు కొన్ని సంవత్సరాల క్రితమే సల్మా అనే మహిళతో పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిల్పా గత రెండు సంవత్సరాల నుంచి ఉడిపిలోని కోటేశ్వరలోని అజీజ్ ఫ్లాట్ కు వెళ్లి వస్తోందని, అతని భార్య సల్మా కూడా శిల్పాకు క్లోజ్ గా ఉందని తెలిసింది.

భర్తను రెచ్చగొట్టిన కిలాడీ పెళ్లామ్

భర్తను రెచ్చగొట్టిన కిలాడీ పెళ్లామ్

తన భర్త అజీజ్ కు శిల్పా అనే ప్రియురాలు ఉందని తెలిసినా అతని భార్య సల్మా ఏమాత్రం పట్టించుకోలేదని, ఇంకా భర్తను రెచ్చగొట్టి శిల్పాతో ఎంజాయ్ చెయ్యాలని చెప్పిందని ఆరోపణలు ఉన్నాయి. చివరికి శిల్పా పెళ్లి చేసుకోవాలని అజీజ్ మీద ఒత్తిడి చేసింది. పెళ్లి విషయానికి వచ్చిన తరువాత నువ్వు ఇస్లాం మతం స్వీకరించాలని, నేను చెప్పినట్లు జీవితాంతం ఉండాలని అజీజ్ అతని ప్రియురాలు శిల్పాకు టార్చర్ పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.

విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు

నా ప్రియుడు అజీజ్ నన్ను నిజంగా ప్రేమించలేదని, శారీరకంగా వాడుకుని వదిలేశాడని తెలుసుకున్న శిల్పా మూడు రోజుల క్రితం విషం తాగేసింది. మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిల్పా చికిత్స విఫలమై చనిపోయింది. శిల్పా ఆత్మహత్య చేసుకోవడం ఉడిపి జిల్లాలో కలకలం రేపింది.

లవ్ జీహాద్ పేరుతో?

లవ్ జీహాద్ పేరుతో?

బలవంతంగా శిల్పాను మతం మార్చాలని అజీజ్ ప్రయత్నించాడని, పెళ్లి పేరుతో ఆమెను మోసం చేశాడని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుందని యువతి కుటుంబ సభ్యులు అజీజ్, అతని భార్య సల్మా మీద పోలీసు కేసు పెట్టారు. అజీజ్ లవ్ జీహాద్ పేరుతో శిల్పా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరిపించాడని హిందూ సంఘసంస్థలు ఆరోపిణలు చేస్తున్నాయి.

English summary
Khiladi: Hindu girl commits suicide after muslim man cheating at kundapura in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X