బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: రెండో భర్త చాలు, ఇద్దరు ఎందుకు ?, కిలాడి పెళ్లామ్ స్కెచ్ రివర్స్, బతికించిన కారు, కథ అడ్డం తిరిగింది!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చిక్కమగళూరు: వ్యాపారం చేస్తున్న యువకుడికి అతని కుటుంబ సభ్యులు సొంత రాష్ట్రంలో ఓ యువతితో పెళ్లి సంబంధం మాట్లాడారు. పెళ్లి చేసుకోవడానికి యువతి, యువకుడు ఓకే చెప్పడంతో ఇద్దరి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. వేరే రాష్ట్రానికి భార్యను పిలుచుకుని వెళ్లిన భర్త ఆమెతో సంతోషంగా కాపురం చేశారు. భర్తతో కాపురం చేస్తున్న భార్య పుట్టింటికి వెళ్లింది. తరువాత భర్త వైపు కన్నెత్తికూడా చూడకుండా అతని మొబైల్ ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన భార్య ఆమె భర్తకు సినిమా చూపించింది. వేరే రాష్ట్రంలోని పుట్టింటికి వెళ్లిన భార్య ఎంతకాలం అయినా కాపురానికి రాకపోవడంతో భర్త అతని భార్య పుట్టింటి దగ్గరకు వెళ్లాడు. అంతే అక్కడ భార్య అసలు మ్యాటర్ తెలుసుకున్న భర్త షాక్ అయ్యాడు.

తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా అతన్ని పెళ్లి చేసుకుందని తెలుసుకున్న భర్త బిత్తరపోయాడు. తన భార్య అంతు చూడాలని అనుకున్న భర్త అక్కడి నుంచి బయలు దేరి వెళ్లిపోయాడు. అప్పటికే నా భార్య మొదటి భర్త ఎంట్రీ ఇచ్చాడని అసలు మ్యాటర్ తెలుసుకున్న రెండో భర్త ఎంట్రీ ఇవ్వడంతో సినిమా ట్విస్టులను తలమించిపోయేలా కథ క్లైమాక్స్ కు చేరుకుంది.

Illegal affair: వదిన నీ పద్దతి మార్చుకో, పోరా మీ అన్న మాట్లాడటం లేదు, నువ్వు ఎంత, మరిది చేతిలో ప్రియుడు!Illegal affair: వదిన నీ పద్దతి మార్చుకో, పోరా మీ అన్న మాట్లాడటం లేదు, నువ్వు ఎంత, మరిది చేతిలో ప్రియుడు!

కర్ణాటకలో వ్యాపారం

కర్ణాటకలో వ్యాపారం

రాజస్థాన్ కు చెందిన మోహన్ రామ్ అనే యువకుడు కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కడూరుకు చేరుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల నుంచి మోహన్ రామ్ కడూరులోనే వ్యాపారం చేస్తున్నాడు. కడూరులో వ్యాపారం చేస్తున్న మోహన్ రామ్ కు పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు రాజస్థాన్ లో నివాసం ఉంటున్న మంజుల అనే యువతి పెళ్లి సంబంధం మాట్లాడారు.

 గ్రాండ్ గా పెళ్లి జరిగింది

గ్రాండ్ గా పెళ్లి జరిగింది

పెళ్లి చేసుకోవడానికి మోహన్ రామ్, మంజుల ఓకే చెప్పడంతో గత ఏడాదిలో ఇద్దరి పెళ్లి రాజస్థాన్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. కర్ణాటకలోని కడూరుకు భార్య మంజులను పిలుచుకుని వెళ్లిన ఆమె భర్త మోహన్ రామ్ ఆమెతో సంతోషంగా కాపురం చేశారు. గత ఏడాది నుంచి మంజుల, మోహన్ రామ్ దంపతులు కడూరులోనే నివాసం ఉంటున్నారు.

భర్త ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన భార్య

భర్త ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిన భార్య

నాలుగు నెలల క్రితం భర్త మోహన్ రామ్ తో కాపురం చేస్తున్న అతని భార్య మంజుల రాజస్థాన్ లోని ఆమె పుట్టింటికి వెళ్లింది. భర్త మోహన్ రామ్ వైపు కన్నెత్తికూడా చూడకుండా అతని మొబైల్ ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టిన మంజుల ఆమె భర్తకు సినిమా చూపించింది. రాజస్థాన్ లోని పుట్టింటికి వెళ్లిన మంజుల ఎంతకాలం అయినా కాపురానికి రాకపోవడంతో ఆమె భర్త మోహన్ రామ్ విసిగిపోయాడు.

రెండో పెళ్లి చేసుకున్న భార్య

రెండో పెళ్లి చేసుకున్న భార్య

రాజస్థాన్ లోని అతని భార్య పుట్టింటి దగ్గరకు వెళ్లాడు. అంతే అక్కడ భార్య మంజలు అసలు మ్యాటర్ తెలుసుకున్న మోహన్ రాజ్ షాక్ అయ్యాడు. రాజస్థాన్ లోని పిప్పివాళ గ్రామంలో నివాసం ఉంటున్న వ్యాపారి ఓం ప్రకాష్ ను తన భార్య మంజుల రెండో పెళ్లి చేసుకుందని తెలుసుకున్న మోహన్ రామ్ రగిలిపోయాడు.

 ఫస్ట్ మొగుడి హత్యకు భార్య స్కెచ్

ఫస్ట్ మొగుడి హత్యకు భార్య స్కెచ్

తన భార్య మంజుల అంతు చూడాలని అనుకున్న మోహన్ రామ్ రాజస్థాన్ నుంచి బయలు దేరి కర్ణాటకలోని కడూరుకు వెళ్లిపోయాడు. నా భార్య మంజుల కోసం ఆమె మొదటి భర్త మోహన్ రామ్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడని అసలు మ్యాటర్ తెలుసుకున్న ఆమె రెండో భర్త ఓం ప్రకాష్ ఎంట్రీ ఇచ్చాడు. నా మొదటి భర్త మోహన్ రామ్ ను చంపేద్దామని, తరువాత మనం సంతోషంగా ఉందామని కిలాడీ లేడీ మంజుల ఆమె రెండో భర్త ఓం ప్రకాష్ కు చెప్పింది.

మొదటి భర్తను కిడ్నాప్ చేసిన రెండో మొగుడు

మొదటి భర్తను కిడ్నాప్ చేసిన రెండో మొగుడు

భార్య మంజుల రెచ్చగొట్టడంతో ఓం ప్రకాష్ కొందరు స్నేహితులను వెంటపెట్టుకుని కడూరుకు చేరుకున్నాడు. రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వెలుతున్న మోహన్ రామ్ ను అతని భార్య మంజుల రెండో భర్త ఓంప్రకాష్, అతని స్నేహితులు కిడ్నాప్ చేశారు. మోహన్ రామ్ ను కిడ్నాప్ చేసే సమయంలో కడూరులో నివాసం ఉంటున్న ఇద్దరు యువకులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కారు రిపేర్ తో కథ అడ్డం తిరిగింది

కారు రిపేర్ తో కథ అడ్డం తిరిగింది

పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలించారు. చిక్కమగళూరు అటవి ప్రాంతంలో మోహన్ రామ్ ను హత్య చెయ్యాలని ఓం ప్రకాష్ ముందుగానే స్కెచ్ వేసి అటువైపు బయలుదేరాడు. అయితే మార్గం మద్యలో కారు రిపేర్ అయ్యి రోడ్డు మీద ఆగిపోయింది. కారు రిపేర్ చేస్తున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మంజుల రెండో భర్త ఓం ప్రకాష్ హడలిపోయారు.

ఇద్దరు మొగుళ్ల కథ క్లోజ్ అయ్యిందని ఎస్కేప్

ఇద్దరు మొగుళ్ల కథ క్లోజ్ అయ్యిందని ఎస్కేప్

పోలీసులు ఓం ప్రకాష్, అతని స్నేహితులను అరెస్టు చేసి మోహన్ రామ్ ను రక్షించారు. తన మొదటి భర్త మోహన్ రామ్ బతికిపోయాడని, రెండో భర్త ఓం ప్రకాష్ అరెస్టు అయ్యాడని తెలుసుకున్న కిలాడీ లేడీ మంజుల ఎస్కేప్ అయ్యిందని కడూరు పోలీసులు తెలిపారు. మొత్తం మీద ఇద్దరు మొగుళ్లు దూరం కావడంతో మంజుల పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది.

English summary
Khiladi lady: Wife and 2nd husband kidnap first husband for murder, police caught accused due to car issues in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X