సిగ్గులేకుండా అవినీతి మంత్రులను కాపాడుతున్న సీఎం, సిద్దూ కౌంటర్ తో!

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్ మంత్రుల చర్యలను సమర్థించిన సిగ్గులేని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటూ ఘాటుగా విమర్శించిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ. కుమారస్వామిపై సిఎం సిద్ధరామయ్య ఎదురుదాడి చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి షాక్ వల్ల కుమారస్వామి మానసిక స్థైర్యం కోల్పోయినట్లు కనిపిస్తోందని, ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం సిద్దరామయ్య వ్యంగంగా ట్వీట్ చేశారు.

సిద్ధరామయ్య ట్వీట్ చేస్తూ ఇటీవల హెచ్ డీ కుమారస్వామి నాపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ఇలాంటి భాష ఉపయోగించడాన్ని నేను గమనించానని, అసెంబ్లీ ఎన్నికల ఓటమి షాక్‌తో మానసిక స్థైర్యం కోల్పోయినట్లున్నారని, మీరు త్వరగా కోలుకోవాలని మాత్రమే నేను కోరుకుంటున్నానని సీఎం సిద్దరామయ్య వ్యంగంగా ట్వీట్ చేశారు.

Siddaramaiah Kumaraswamy

ఇప్పుడు కుమారస్వామి ఆయన ప్రస్తావించిన నకిలీ లెటర్, అసలైన ఎమ్మెల్యే లేఖ అంశం త్వరలో విచారణలో బయటపడుతుందని సీఎం సిద్దరామయ్య బదులిచ్చారు. దీంతో మాజీ సీఎం, కుమారస్వామి, కర్ణాటక ప్రస్తుత సీఎం సిద్దరామయ్యల మాటల యుద్దం కొనసాగుతుందని తెలుస్తోంది. కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి చెలువరాయస్వామికి లంచం అందిందని రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

అయితే ఇది ఆరోపణ, కుట్ర అని, తన మీద కక్ష సాధించడానికి కొందరు ఇలా ప్రయత్నిస్తున్నాని మంత్రి చెలువరాయస్వామి అంటున్నారు. ఇదే అంశంపై జేడీఎస్‌ మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి వరుస ట్వీట్‌లు చేశారు. మంత్రి పరువుకు భంగం కలిగించే చర్యలను సమర్థించడం ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అవమానకరమన్నారు.

మంత్రి చెలువురాయస్వామి ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని, దోపిడీ చేస్తున్న వారి చర్యలు అసహ్యంగానూ, వికారంగానూ ఉందని కుమారస్వామి మండిపడుతున్నారు. కొందరు మంత్రులతో పాటు సీఎం సిద్దరామయ్యను టార్గెట్ చేసిన మాజీ సీఎం కుమారస్వామి వీలు చిక్కినప్పుడు మాత్రం వారి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+