Leader: సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అన్న కొడుకు మాయం, కెనాల్ లో శవమైనాడు, ఏం జరిగింది!
బెంగళూరు/దావణగెరె: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, కర్ణాటక ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎంపీ. రేణుకాచార్య కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. నాలుగు రోజుల క్రితం మాయం అయిన బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ. రేణుకాచార్య అన్న కుమారుడు చంద్రశేఖర్ కారును తుంగా నది కెనాల్ లో స్వాధీనం చేసుకున్నారు.
షాకింగ్ విషయం ఏమిటంటే అదే కారులో బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ. రేణుకాచార్య అన్న కుమారుడు చంద్రశేఖర్ కూడా శవమై కనిపించడం కలకలం రేపింది. చంద్రశేఖర్ స్నేహితుడిని గురువారం ఉదయం పోలీసులు అరెస్టు చెయ్యడం, అదే రోజు సాయంత్రం నది కాలువలో చంద్రశేఖర్ కారులో శవమై కనిపించడంతో బీజేపీ నాయకులు హడలిపోయారు.

మూడు రోజుల క్రితం మాయం
కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, కర్ణాటక ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎంపీ. రేణుకాచార్య అన్న కుమారుడు చంద్రశేఖర్ అలియాస్ చంద్రూ మూడు రోజుల క్రితం శివమొగ్గలోని వినయ్ గురూజీ ఆశ్రమానికి వెళ్లాడు. ఆదివారం రాత్రి శివమొగ్గ నుంచి బయలుదేరిన చంద్రశేఖర్ ఆచూకి మాత్రం గురువారం మద్యాహ్నం వరకు చిక్కలేదు.

స్నేహితుడి మీద అనుమానంతో అరెస్టు
ఎంపీ. రేణుకాచార్య అన్న కుమారుడు చంద్రశేఖర్ కనపడటం లేదని దావణగెరెలో ఇప్పటికే మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది, చంద్రశేఖర్ ఎవరెవరిని కలిశాడు, అతనికి ఎవరు ఫోన్లు చేశారు ?, చంద్రు ఎక్కడెక్కడికి వెళ్లాడు అని పోలీసులు ఆరా తీశారు. గురువారం ఉదయం శివమొగ్గలో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ స్నేహితుడు కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు.

కారులో శవమైన చంద్రశేఖర్
కర్ణాటక బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఎంపీ. రేణుకాచార్య అన్న కుమారుడు చంద్రశేఖర్ కారును గురువారం సాయంత్రం హోన్నాళి-న్యామతి ఏరియాలోని తుంగా నది కెనాల్ లో స్వాధీనం చేసుకున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే అదే కారులో బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ. రేణుకాచార్య అన్న కుమారుడు చంద్రశేఖర్ కూడా శవమై కనిపించడం కలకలం రేపింది.

బోరున విలపించిన ఎమ్మెల్యే
వందలాది మంది సంఘటనా స్థలంలో గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాను దూకుడుగా వ్యవహరిస్తానని, నా అన్న కుమారుడు చంద్రశేఖర్ ఎంతో ఓపికగా తన నియోజక వర్గం కార్యకర్తల సమస్యలు విని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాడని, అలాంటి మంచి మనిషి ఇలా శవమై కనిపించడం తట్టుకోలేకపోతున్నానని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, చంద్రశేఖర్ చిన్నాన రేణుకాచార్య బోరున విలపిస్తున్నారు.

ఏం జరిగింది ?, వెనుక సీటులో శవం
చంద్రశేఖర్ కారుతో సహ నది కాలువలో ఎలా పడిపోయాడు, ఎవరైనా హత్య చేసి కెనాల్ కాలువలో కారుతో సహ తోసేశారా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చంద్రశేఖర్ కారు డ్రైవింగ్ చేసి ఉంటే శవం వెనుక సీటులోకి ఎలా వెళ్లింది ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే అరెస్టు అయిన చంద్రశేఖర్ స్నేహితుడు కిరణ్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications