Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lovers: రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి, ప్రియుడి సమాధి పక్కనే ప్రియురాలి సమాధి, ఏం జరిగిందంటే!

బెంగళూరు/తుమకూరు: యువతి, యువకుడు సమీప బందువులు కావడంతో ముందునుంచి ఇద్దరికి పరిచయం ఉంది. మూడు సంవత్సరాల నుంచి యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. యువకుడు ఐటీ హబ్ లో వ్యాపారం చేస్తున్నాడు. యువతి ఎమ్మెస్సీ చదువుతోంది. యువతి, యువకుడు ప్రేమించుకోవడం, ఇద్దరు బంధువులు కావడంతో అమ్మాయి చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి చెయ్యాలని ఇరు వైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లికి పెద్దలు అంగీకరించారని ప్రేమికులు సంతోషించారు.

పెద్దలు పెళ్లికి అంగీకరించినా విధి వాళ్లకు అనుకూలంగా మారలేదు. జాతర కోసం సొంత ఊరికి వెలుతున్న ప్రియుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రియుడి అత్యక్రియలకు ప్రియురాలు హాజరైయ్యింది. జీవితాంతం కలిసి జీవించాలి అనుకున్న ప్రేమికుల ఆశలు చెల్లాచెదురు అయ్యాయి.

ప్రియుడు లేని జీవితం తనకు వద్దు అని ప్రియురాలు అనుకుంది. ప్రియుడి అంత్యక్రియలు జరిగిన మూడు రోజులకే ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రియుడి సమాధి పక్కనే అతని ప్రియురాలి అంత్యక్రియలు చెయ్యడంతో అందరూ చలించిపోయారు.

దూరపు బంధువులు

దూరపు బంధువులు

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని మస్కల్ గ్రామంలో ధనుష్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. తుమకూరు జిల్లాలోని అరేహళ్లి గ్రామంలో సుష్మా (22) అనే యువతి నివాసం ఉంటున్నది. ధనుష్, సుష్మా సమీప బందువులు కావడంతో ముందునుంచి ఇద్దరికి పరిచయం ఉంది. మూడు సంవత్సరాల నుంచి ధనుష్, సుష్మా ప్రేమించుకుంటున్నారు.

వ్యాపారం చేస్తున్న ప్రియుడు.... ఎమ్మెస్సీ చదువుతున్న ప్రియురాలు

వ్యాపారం చేస్తున్న ప్రియుడు.... ఎమ్మెస్సీ చదువుతున్న ప్రియురాలు

ధనుష్ ఐటీ హబ్ బెంగళూరులో బట్టల షోరూమ్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. సుష్మా ఎమ్మెస్సీ చదువుతోంది. ధనుష్, సుష్మా ప్రేమించుకుంటున్నారని వాళ్ల కుటుంబ సభ్యులకు తెలిసింది. ధనుష్, సుష్మా ప్రేమించుకోవడం, ఇద్దరు బంధువులు కావడంతో అమ్మాయి చదువు పూర్తి అయిన తరువాత పెళ్లి చెయ్యాలని ఇరు వైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ప్రియుడు

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ప్రియుడు

పెళ్లికి పెద్దలు అంగీకరించారని ప్రేమికులు ధనుష్, సుష్మా చాలా సంతోషించారు. పెద్దలు పెళ్లికి అంగీకరించినా విధి వాళ్లకు అనుకూలంగా మారలేదు. ఊర్లో జరుగుతున్న జాతర కోసం సొంత ఊరికి బెంగళూరు నుంచి బైక్ లో వెలుతున్న ప్రియుడు ధనుష్ బెంగళూరు సమీపంలోని నెలమంగల సమీపంలోని డాబస్ పేట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

ప్రియుడి అంత్యక్రియులకు వెళ్లిన ప్రియురాలు

ప్రియుడి అంత్యక్రియులకు వెళ్లిన ప్రియురాలు

ధనుష్ సొంత పొలంలోనే అతని అంత్యక్రియులు జరిపించారు. ప్రియుడు ధనుష్ అత్యక్రియలకు అతని ప్రియురాలు సుష్మా హాజరైయ్యింది. జీవితాంతం కలిసి జీవించాలి అనుకున్న ప్రేమికులు ధనుష్, సుష్మాల ఆశలు చెల్లాచెదురు అయ్యాయి. ప్రియుడు ధనుష్ లేని జీవితం తనకు వద్దు అని అతని ప్రియురాలు సుష్మా అనుకుంది.

ప్రియుడి లేని జీవితం వద్దని ప్రియురాలి ఆత్మహత్య

ప్రియుడి లేని జీవితం వద్దని ప్రియురాలి ఆత్మహత్య

ప్రియుడు ధనుష్ అంత్యక్రియలు జరిగిన మూడు రోజులకే అతని ప్రియురాలు సుష్మా అవేదనతో కుమిలిపోయింది. రాత్రి రూమ్ లో సుష్మా విషం తాగి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రియుడు ధనుష్ సమాధి పక్కనే అతని ప్రియురాలు సుష్మా అంత్యక్రియలు చెయ్యడంతో అందరూ చలించిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+