Lovers: ప్రియురాలికి పెళ్లి ఫిక్స్, గర్ల్ ఫ్రెండ్ ను చితకబాదిన ప్రియుడు, అమ్మాయి ఫ్యామిలీ ఏంచేసిందంటే?!
బెంగళూరు/శివమొగ్గ: కాలేజ్ లో చదువుకోవడానికి ఓ యువతి సిటీకి వెళ్లింది. కాలేజ్ లో చదువుకుంటున్న యువతికి అదే సిటీలో నివాసం ఉంటున్న వేరే మతానికి చెందిన యువకుడు పరిచయం అయ్యాడు కొంతకాలం ఇద్దరూ స్నేహితులుగా ఉన్నారు. కాలేజ్ చదువు పూర్తి అయ్యే వరకు ప్రియుడితో కలిసి ఆమె సంతోషంగా తిరిగింది. కాలేజ్ పూర్తి అయిన తరువాత ఆ అమ్మాయి ప్రియుడితో టచ్ లో ఉంది.
ప్రియురాలికి వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు అతని ప్రియురాలిని చితకబాదేశాడు. మ్యాటర్ తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమె మాజీ ప్రియుడి ఇంటిని ద్వంసం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇద్దరి మతాలు వేరు
కర్ణాటకలోని భద్రావతి పట్టణంలో నేత్రావతి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. కాలేజ్ లో చదువుకోవడానికి నేత్రావతి అనే వతి శివమొగ్గ సిటీకి చేరుకుని కాలేజ్ లో చేరింది. కాలేజ్ లో చదువుకుంటున్న నేత్రావతికి శివమొగ్గ నగరంలోని మార్నామిబవైల్ ఏరియాలో నివాసం ఉంటున్న రసూల్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు పరిచయం అయ్యాడు.

కాలేజ్ అమ్మాయితో లవ్
నేత్రావతికి శివమొగ్గ సిటీలో నివాసం ఉంటున్న రసూల్ దగ్గర అయ్యాడు. వేరే మతానికి చెందిన రసూల్, నేత్రవాతి స్నేహితులు అయ్యారు. కొంతకాలం ఫ్రెండ్స్ గా ఉన్న నేత్రావతి, రసూల్ స్నేహితులుగా తరువాత ప్రేమించుకున్నారు. కాలేజ్ చదువు పూర్తి అయ్యే వరకు ప్రియుడు రసూల్ కలిసి నేత్రవాతి సంతోషంగా తిరిగిందని సమాచారం.

ప్రియురాలికి పెళ్లి ఫిక్స్ అయ్యిందని?
కాలేజ్ పూర్తి అయిన తరువాత భద్రావతికి వెళ్లిపోయిన నేత్రావతి ఆమె ప్రియుడ రసూల్ తో టచ్ లో ఉందని తెలిసింది. ఇటీవల ప్రియురాలు నేత్రావతికి వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న నేత్రావతి ప్రియుడు రసూల్ నేరుగా భద్రావతి వెళ్లి అతని ప్రియురాలు నేత్రావతిని చితకబాదేశాడు.

ప్రియుడి ఇళ్లు ద్వంసం
నేత్రవాతి మీద దాడి చేసిన రసూల్ మీద భద్రావతి పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఇదే సందర్బంలో రసూల్ శివమొగ్గ పారిపోయాడు. నేత్రావతి మీద రసూల్ దాడి చేశాడని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. రగిలిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు నేరుగా శివమొగ్గ చేరుకుని రసూల్ నివాసం ఉంటున్న అద్దె ఇంటిలోని వస్తులు పూర్తిగా ధ్వంసం చేశారు. రసూల్ ను పట్టుకుని చితకబాదేశారు. అమ్మాయి కుటుంబ సభ్యుల మీద శివమొగ్గలోని దొడ్డపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications