Power Star: డిగ్రీ పాఠ్యపుస్తకంలో పవర్ స్టార్ జీవిత చరిత్ర, చేతులు ఎత్తి దండం పెట్టిన ఫ్యాన్స్!
బెంగళూరు: పవర్ స్టార్ అభిమానుల కోరిక మేరకు కర్ణాటక రత్న డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను కన్నడ భాషా పాఠ్య పుస్తకంలో పొందుపరిచారు. బెంగళూరు యూనివర్శిటీ అధికారులు కన్నడ పాఠ్య పుస్తకంలో పునీత్ రాజ్‌కుమార్ పరిపూర్ణ జీవితం నుండి ఒక సారాంశం సేకరించి కన్నడ పాఠ్యపుస్తకంలో పొందుపరిచారు. శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ దాదాపు 14 నెలల క్రితం వరకు అందరి కళ్లముందు ఉన్నారు. తరువాత ఈలోకాన్ని వదిలిన పునీత్ రాజ్ కుమార్ అందరికి దూరం అయ్యారు.

పవర్ స్టార్ అంటే మాటలు కాదు
స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు లక్ష మందికి పైగా ఆయన అంతిమ దర్శనం చేసుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ తో పాటు మాజీ సీఎంలు, మంత్రులు పునీత్ రాజ్ కుమార్ కు అంతిమ వీడ్కోలుపలికారు.

అభిమానుల ఆశ
పవర్ స్టార్, కర్ణాటక రత్న డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను కన్నడ పాఠ్యపుస్తకంలో పొందుపరచాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. ఈ మేరకు డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ అభిమానుల సంఘాలు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాశాయి. విద్యాశాఖ మంత్రిని కలిసిన పునీత్ రాజ్ కుమార్ అభిమాన సంఘాలు ఆయనకు వినతి పత్రం సమర్పించారు.

నేనే రాజకుమార
ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ అభిమానుల కోరిక తీరింది. బెంగుళూరు విశ్వవిద్యాలయం తన డిగ్రీ బీకామ్ మూడవ సెమిస్టర్ లో కన్నడ భాషా కోర్సు వాణిజ్య కన్నడ 3లో పునీత్ జీవితం నుండి ఒక సారాంశాన్ని పొందుపరిచింది. అంతకుముందు బెంగళూరు యూనివర్శిటీ తన గ్రాడ్యుయేషన్ థీసిస్‌లో శరణు హళ్లూర్ రాసిన నేనే రాజకుమారలోని లోహిత్ ఎంబా మరిముడు అధ్యాయాన్ని ఉపయోగించింది.

బీకామ్ మూడో సెమిస్టర్
డాక్టర్ మునియప్ప ఈ పాఠ్యపుస్తకానికి ప్రధాన సంపాదకులు. డాక్టర్ అమరేంద్ర శెట్టి, డాక్టర్ కె.నిమ్ హోయసాలాదిత్య, డాక్టర్ శివరాజ్, డాక్టర్ రఘునందన్ పునీత్ రాజ్ కుమార్ అధ్యయనం వచన సంపాదకులు. ప్రస్తుత సంవత్సరం డిగ్రీ బీకామ్ మూడవ సెమిస్టర్ విద్యార్థులు కన్నడ భాషలో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ బాల్యం గురించి తెలుసుకుంటున్నారు.

పునీత్ రాజ్ కుమార్ భార్య
డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని పునీత్ రాజ్‌కుమార్ కొద్ది రోజుల క్రితం నేనే రాజకుమార పుస్తకం యొక్క నాలుగవ ఎడిషన్‌ను విడుదల చేశారు. ఈ పుస్తకం కర్ణాటకలో, కన్నడ బాషలో అత్యధికంగా అమ్ముడైన జీవిత చరిత్రగా రికార్డు సృష్టించింది. ఇంత వరకు కన్నడలో ఏ పుస్తకం కూడా ఇన్ని కాపీలు అమ్ముడుపోలేదు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
కర్ణాటక ప్రభుత్వం, బెంగళూరు యూనివర్శిటీ కర్ణాటక రత్న డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను కన్నడ పాఠ్యపుస్తకాల్లో పొందుపరచడంతో ఆయన అభిమాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా కర్ణాటక ప్రభుత్వం, బెంగళూరు యూనివర్శిటీ అధికారులకు పునీత్ రాజ్ కుమార్ థ్యాక్స్ చెబుతున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications