Puneeth Rajakumar: నా తమ్ముడు హీరో కాదు, ప్రజల మనిషి, అన్నయ్య, పవర్ స్టార్ పేరుతో !
బెంగళూరు/ మైసూర్: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చిన్నప్పటి నుంచి ప్రజల మద్యలో పెరిగిన వ్యక్తి, తన తమ్ముడికి మరణం లేదని, మనలో సజీవంగా ఉన్నారని పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్న, హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ అన్నారు. జేమ్స్ సినిమాను అభిమానులతో కలిసి చూసిన శివరాజ్ కుమార్ భావోద్వేగానికి గురైనారు. ఫిల్మ్ సిటీకి పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టే విషయంలో సాటి నటీనటులు, ప్రభుత్వం, సినీరంగ ప్రముఖులు నిర్ణయం తీసుకుంటారని, ఆ విషయంలో నేనే ఎక్కువగా మాట్లాడనని, ఇది ఫ్యామిలీ విషయం కాదని, పునీత్ అభిమానుల కోరిక అని తెలిసిందని హీరో శివరాజ్ కుమార్ అన్నారు. పునీత్ రాజ్ కుమార్ నటుడిగా కంటే పదిమందికి సహాయం చేసి ప్రజలకు ఇంకా దగ్గర అయ్యాడని శివరాజ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. తన తమ్ముడు నటుడిగా కాకుండా స్నేహితుడిగా, కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా, అక్కాచెల్లెల్లుకు సోదరుడిగా, ఓ ఇంటి మనిషిలా ప్రతి ఒక్కరికి దగ్గర అయ్యాడని, తన కుటుంబంలో తన తండ్రి డాక్టర్ రాజ్ కుమార్ తరువాత ప్రజలకు అంత దగ్గర అయిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ ఒక్కడే అని శివరాజ్ కుమార్ భావోగ్వేదంతో అన్నారు. పునీత్ రాజ్ కుమార్ పేరుతో ఓ పౌండేషన్ ప్రారంభించి నిరంతరం సమాజ సేవ చేస్తామని శివరాజ్ కుమార్ చెప్పారు, పునీత్ రాజ్ కుమార్ పౌండేషన్ తో కలిసి పని చెయ్యడానికి ఇప్పటికే చాలా మంది దాతలు, పునీత్ స్నేహితులు, అభిమానులు సహాయం చెయ్యడానికి ముందుకు వస్తున్నారని శివరాజ్ కుమార్ చెప్పారు. పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్ లో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో కలిసి అతని సోదరుడు డాక్టర్ శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ కలిసి నటించడం, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ కుమారులు ముగ్గురిని ఒకేసారి, ఒకే స్క్రీన్ మీద చూడటంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి.

కన్నడనాడులో జేమ్స్ హవా
మార్చి 17వ తేదీ స్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 47వ పుట్టిన రోజు వేడుకలు కర్ణాటకతో పాటు దేశ విదేశాల్లో ఉన్న అప్పు అభిమానులు ఘనంగా నిర్వహించారు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరిసారిగా నటించిన జేమ్స్ సినిమా కూడా మార్చి 17వ తేదీన విడుదల అయ్యింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మళయాలం, హిందీ బాషల్లో జేమ్స్ సినిమా గురువారం విడుదల అయ్యింది.

ఎక్కడ చూసినా జేమ్స్ సినిమా టాపిక్ మాత్రమే
కన్నడ నాట గురువారం అన్ని విషయాలు పక్కన పెట్టిన కన్నడిగులు కేవలం జేమ్స్ సినిమా గురించే చర్చించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. జేమ్స్ సినిమా విడుదలైన సినిమా థియేటర్లలో పునీత్ రాజ్ కుమార్ అభిమాన సంఘాల నాయకులు ఉదయం నుంచి టీలు, టిఫిన్లు, మద్యాహ్నం భోజనాలు, మజ్జిగ, పంచి పెట్టారు.

అభిమానులతో జేమ్స్ సినిమా చూసిన శివన్న
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చిన్నప్పటి నుంచి ప్రజల మద్యలో పెరిగిన వ్యక్తి, తన తమ్ముడికి మరణం లేదని, మనలో సజీవంగా ఉన్నారని పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్న, హ్యాట్రిక్ హీరో డాక్టర్ శివరాజ్ కుమార్ అన్నారు. గురువారం మైసూరు నగరంలో జేమ్స్ సినిమాను అభిమానులతో కలిసి చూసిన శివరాజ్ కుమార్ భావోద్వేగానికి గురైనారు.

ఫిల్మ్ సిటీకి పునీత్ రాజ్ కుమార్ పేరు ?
ఫిలిమ్ సిటీకి పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టే విషయంలో సాటి నటీనటులు, ప్రభుత్వం, సినీరంగ ప్రముఖులు నిర్ణయం తీసుకుంటారని, ఆ విషయంలో నేనే ఎక్కువగా మాట్లాడనని, ఇది ఫ్యామిలీ విషయం కాదని, పునీత్ అభిమానుల కోరిక అని తెలిసిందని హీరో శివరాజ్ కుమార్ అన్నారు. పునీత్ రాజ్ కుమార్ నటుడిగా కంటే పదిమందికి సహాయం చేసి ప్రజలకు ఇంకా దగ్గర అయ్యాడని శివరాజ్ కుమార్ గుర్తు చేసుకున్నారు.

ప్రతి ఇంట్లో ఓ మనిషి అయ్యాడు.... రాజ్ కుమార్ తరువాత !
తన తమ్ముడు నటుడిగా కాకుండా స్నేహితుడిగా, కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా, అక్కాచెల్లెల్లుకు సోదరుడిగా, ఓ ఇంటి మనిషిలా ప్రతి ఒక్కరికి దగ్గర అయ్యాడని, తన కుటుంబంలో తన తండ్రి డాక్టర్ రాజ్ కుమార్ తరువాత ప్రజలకు అంత దగ్గర అయిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ ఒక్కడే అని శివరాజ్ కుమార్ భావోగ్వేదంతో అన్నారు.

పునీత్ రాజ్ కుమార్ పౌండేషన్
పునీత్ రాజ్ కుమార్ పేరుతో ఓ పౌండేషన్ ప్రారంభించి నిరంతరం సమాజ సేవ చేస్తామని శివరాజ్ కుమార్ చెప్పారు, పునీత్ రాజ్ కుమార్ పౌండేషన్ తో కలిసి పని చెయ్యడానికి ఇప్పటికే చాలా మంది దాతలు, పునీత్ స్నేహితులు, అభిమానులు సహాయం చెయ్యడానికి ముందుకు వస్తున్నారని శివరాజ్ కుమార్ చెప్పారు.
Recommended Video

ఒకే సినిమాలో తమ్ముడితో కలిసి అన్నయ్యలు
పునీత్ రాజ్ కుమార్ చివరి చిత్రం జేమ్స్ లో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో కలిసి అతని సోదరుడు డాక్టర్ శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ కలిసి నటించడం, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ కుమారులు ముగ్గురిని ఒకేసారి, ఒకే స్క్రీన్ మీద చూడటంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి.












Click it and Unblock the Notifications