Revenge: లోన్ అడిగితే ఇవ్వరా.. ఈ కస్టమర్ ఎంత పనిచేశాడో చూడండి..బాబోయ్..!!

బెంగళూరు/ హావేరి: వ్యాపారం చెయ్యాలని అనుకున్న ఓ యువకుడు తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశాడు. తెలిసినవాళ్లు అప్పు ఇవ్వడానికి నిరాకరించారు. బ్యాంకులో లోన్ తీసుకోవాలని ఆ యువకుడు అనుకున్నాడు. ప్రముఖ బ్యాంకులో లోన్ తీసుకోవాలని ఆ యువకుడు అనేక ప్రయత్నాలు చేశాడు. కొంతకాలం అతను బ్యాంకు చుట్టూ తిరుగుతూ లోన్ తీసుకోవాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఇదే సమయంలో బ్యాంకు మీద పెట్రోల్ పోసిన యువకుడు నిప్పంటించడం కలకలం రేపింది. బ్యాంకుకు మంటలు వ్యాపించిన విషయం గుర్తించిన స్థానికులు మంటలు అదుపు చేసి ఆ యువకుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

వ్యాపారం చెయ్యాలని ఆలోచన

వ్యాపారం చెయ్యాలని ఆలోచన

కర్ణాటకలోని హావేరి జిల్లాలోని బ్యాడగి తాలుకా, హడిగ్లూండ గ్రామంలోని రట్టికట్టి ఏరియాలో వాసీమ్ ముల్లా అలియాస్ వాసీం (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఏదైనా మంచి వ్యాపారం చెయ్యాలని వాసీమ్ చాలాకాలం నుంచి ఆలోచిస్తున్నాడు. వ్యాపారం చెయ్యడానికి వాసీమ్ కు డబ్బు అవసరం అయ్యింది.

అప్పు చెయ్యాలని ప్రయత్నం

అప్పు చెయ్యాలని ప్రయత్నం

వ్యాపారం చెయ్యాలని అనుకున్న వాసీమ్ తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశాడు. తెలిసినవాళ్లు, బంధువులు వాసీమ్ కు అప్పు ఇవ్వడానికి నిరాకరించారు. ఎక్కడెక్కడో అప్పు చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేసిన వాసీమ్ చివరికి తనకు ఎవ్వరూ అప్పు ఇవ్వరని తెలుసుకున్నాడు.

బ్యాంకులో లోన్ తీసుకోవాలని?

బ్యాంకులో లోన్ తీసుకోవాలని?

హడిగ్లూండు లోని కెనరా బ్యాంకులో లోన్ తీసుకోవాలని వాసీమ్ అనుకున్నాడు. కెనరా బ్యాంకులో లోన్ తీసుకోవాలని వాసీమ్ అనేక ప్రయత్నాలు చేశాడు. కొంతకాలం నుంచి వాసీమ్ కెనరా బ్యాంకు చుట్టూ తిరుగుతూ లోన్ తీసుకోవాలని ప్రయత్నించాడు. అయితే వాసీమ్ కు బ్యాంకు లోన్ ఇవ్వడానికి బ్యాంకు అధికారులు నిరాకరించారని తెలిసింది.

బ్యాంకు మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు

బ్యాంకు మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు

తనకు కెనరా బ్యాంకులో లోన్ ఇవ్వకుండా తిప్పించుకుని చివరికి చేతులు ఎత్తేశారని వాసీమ్ రగిలిపోయాడు. ఇదే సమయంలో కెనరా బ్యాంకు మీద పెట్రోల్ పోసిన వాసీమ్ నిప్పంటించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు. బ్యాంకుకు అంటుకున్న మంటలు వ్యాపించిన విషయం గుర్తించిన స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి వాసీమ్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

బ్యాంకు మేనేజర్ మీద పగ.... ప్రతీకారం

బ్యాంకు మేనేజర్ మీద పగ.... ప్రతీకారం

తనకు బ్యాంకు మేనేజర్ లోన్ ఇవ్వడానికి నిరాకరించాడని, అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించానని వాసీమ్ చెప్పాడని పోలీసులు అన్నారు. బ్యాంకు మీద పెట్రోల్ పోసి నిప్పంటించడంతో కొన్ని పత్రాలు, కంప్యూటర్లు దెబ్బ తిన్నాయని స్థానికులు అంటున్నారు. అయితే బ్యాంకు అధికారులు మాత్రం ఎంత నష్టం జరిగింది అనే విషయం బయటకు చెప్పడం లేదని స్థానికులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+